మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అరువు తెచ్చుకున్న హీరోయిన్లతోనే నిండిపోయింది. ఒకప్పుడు తెలుగు హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేవారు. ఎప్పుడైతే సినిమా రంగుల్లోకి మారిందో.. అప్పటి నుంచి హీరోయిన్ల రంగులు కూడా మారిపోయాయి. స్మార్ట్ గా సినిమా మారడం మొదలుపెట్టినప్పటి నుంచి గ్లామర్ కు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. గ్లామర్ గా ఉండాలి.. అంగాంగ ప్రదర్శనకు అడ్డు చెప్పకూడదు అనే ఉద్దేశ్యంతో సినిమాలోకి ఇతర భాషల్లోనుంచి వలసను ప్రోత్సహించడం మొదలు పెట్టారు.
ఆ ప్రోత్సాహం ఇప్పుడు ఎలా మారింది అంటే.. తెలుగు సినిమాల్లో తెలుగురాని హీరోయిన్లతో నిండిపోయింది. తెలుగును గౌరవిద్దాం.. తెలుగులోనే మాట్లాడదాం అని చెప్పే మన స్టార్లు.. హీరోయిన్ల విషయంలో మాత్రం తూచ్ అంటున్నారు. తెలుగు హీరోయిన్లను ఎందుకు పక్కన పెడుతున్నారు. వాళ్లలో టాలెంట్ లేదా వాళ్లకు అందం లేదా అంటే టన్నుల కొట్టి ఉన్నది. మనకు ఓ సామెత ఉంది... పొరిగింటి పుల్ల కూర రుచి అని. మన ఇంట్లో ఎంత బాగున్నా పొరుగింట్లో వండుకున్న కూరపైనే దృష్టి ఉంటుంది.
అలానే ఇక్కడ కూడా. తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నది. తెలుగు హీరోయిన్లు గ్లామర్ కు పనికిరారు అనే సామెతను పక్కన పెట్టి గ్లామర్ గా కనిపించేందుకు రెడీ అంటూ.. స్కిన్ షోలతో ఫోటో షూట్లు చేస్తున్నది. ఇప్పుడు ఆ లిస్ట్ లోనే మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె పూజిత పొన్నాడ. అచ్చతెలుగు అమ్మాయి.
టాప్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం.. టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. గ్లామర్ గా కనిపించేందుకు సిద్ధంగా ఉన్నది. అయినా సరే ఆమెను మన దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు. కారణం తెలుగమ్మాయి. కొన్ని సినిమాల్లో కామెడీ సీన్స్ లో చెప్పినట్టు.. తెలుగు వాళ్లే అయినా.. పక్క రాష్ట్రం నుంచి వచ్చినట్టు బిల్డప్ ఇస్తే.. తప్పకుండా అవకాశాలు వస్తాయి అనుకుంటా.