ఒక నాడు దక్షిణాది సినిమాను ఉర్రూతలూగించిన శృంగారతార షకీలా చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచింది తన వ్యక్తిగత, వృత్తిపర వివరాలతో, విశేషాలతో నిజాలతో సంచలనాత్మక ఆత్మకథ రాస్తోంది షకీలా. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న తీపి, చేదు అనుభవాలను చాలా నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఇందులో ఆమె ఆవిష్కరించబోతున్నారట.  ఈ విషయం తెలియగానే దక్షిణాది కి చెందిన సినిమా వ్యక్తులు కలవరపాటుకి గురవుతున్నారట. దీనికి కారణం ఆ ఆత్మకథలో తమ గురించి ఏమైనా నిజాలు చెబుతుందేమో అని ముందే భుజాలు తడుముకుంటున్నారట.  సిల్క్ స్మిత జీవితం డర్టీ పిక్చర్ గా వచ్చి సంచనాలు సృష్టిస్తే ఈ ఆత్మకథ త్వరలోనే మార్కెట్‌లో విడుదల అయి ఇంకా ఎన్ని సంచనాలు సృతిస్తుందో చూడాలి షకీలా కు ప్రస్తుతం ఎలాగూ మార్కెట్ లేదు కాబట్టి ఈ స్వీయచరిత్ర ద్వారా అయినా షకీలా మళ్ళీ దక్షణాది సినిమా రంగంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారే ప్రయత్నం చేస్తోంది కాబోలు.   

మరింత సమాచారం తెలుసుకోండి: