టాలీవుడ్ హీరోల్లో ప్రస్తుతం అత్యధిక బ్రాండ్స్ ను ఎండార్స్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. దాదాపుగా 15 వరకు బ్రాండ్లను తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్, ఇటీవల హంబుల్ పేరుతో ఒక ఆన్లైన్ క్లాతింగ్ స్టోర్ ని కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఆయన ఎండార్స్ చేస్తున్న బ్రాండ్స్ లో ఆయనకు విపరీతంగా పేరు తీసుకువచ్చింది మాత్రం థమ్స్అప్ యాడ్ అనే చెప్పాలి. ఎప్పటికపుడు మహేష్ చేసే ఆ యాడ్స్, ప్రేక్షకులు మరియు ఆయన ఫ్యాన్స్ నుండి మంచి క్రేజ్ సంపాదిస్తూ ఉంటాయి. 

ఇకపోతే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొన్ని బ్రాండ్స్ ని ఎండార్స్ చేస్తున్నారు. వాటిలో ఎక్కువగా ఆయనకు పేరు తీసుకువచ్చింది మాత్రం సేవనప్ మరియు ఫ్రూటీ యాడ్స్ అనే చెప్పాలి. బన్నీ ఇటీవల చేసిన ఫ్రూటీ యాడ్ కు మంచి రేటింగ్స్ మరియు ఫ్యాన్స్ నుండి బాగా అప్లాజ్ కూడా రావడం జరిగింది. ఇక ప్రస్తుతం మరొక హీరో వీరిద్దరికి పోటీగా ప్రముఖ శీతల పానీయమైన స్ప్రైట్ కు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనే నాచురల్ స్టార్ నాని, ఇటీవల పలు సినిమాలతో వరుసగా విజయాలు అందుకుని దూసుకుపోతున్న నాని, తాను యాక్ట్ చేసిన స్ప్రైట్ యాడ్ ని కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. లేటెస్ట్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ చెందినప్పటికీ, 

ఇప్పటికీ అందరిని ఎంతో రిఫ్రెష్ గా ఉంచుతుంది స్ప్రైట్ అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ యాడ్, ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకుపోతోంది. అయితే గతంలో మరొక ప్రముఖ శీతల పానీయమైన పెప్సీ కి మొదట్లో పవన్ కళ్యాణ్, ఆ తరువాత రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించినప్పటికీ, వారు ఎక్కువ కాలం కొనసాగలేదు. మరి నాని వారి వలే స్ప్రైట్ బ్రాండ్ కు అంబాసడర్ గా కొద్దికాలమే కొనసాగుతారా లేక మహేష్, బన్నీ వలె ఎక్కువ కాలం ముందుకు దూసుకెళ్తారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: