టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్, తొలి సినిమా తోనే  మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఆ తరువాత తాను  నటించిన సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ వంటి సినిమాలతో హిట్స్ తో మరింత క్రేజ్ సంపాదించిన రాజ్ తరుణ్, ఇటీవల మాత్రం వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు. ఇకపోతే నిన్న అర్ధరాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు హఠాత్తుగా ప్రమాదం బారిన పడినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, 

నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక పని మీద హైదరాబాద్ నుండి కారులో బయలుదేరిన రాజ్ తరుణ్, శివారు ప్రాంతమైన నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్దకు చేరుకోగానే, సడన్ గా ఆయన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం నాలుగు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయినట్లు  సమాచారం. అయితే కారుకు ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం వల్ల ప్రాణ నష్టం తప్పినట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు కొందరు చెపుతున్నారట. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కారులో రాజ్ తరుణ్‌ ఒక్కడే ఉన్నాడా లేక మరెవరైనా ఆయనతో పాటు ఉన్నారా అనే విషయాలు మాత్రం తెలియరాలేదు. 

ప్రమాదం జరిగిన వెంటనే కారు నుండి బయటపడ్డ రాజ్ తరుణ్, ఎవరికో ఫోన్ చేయడం జరిగిందని, అనంతరం కాసేపటికి కొందరు ఒక కారులో వచ్చి, రాజ్ తరుణ్ ని చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారని అంటున్నారు. ఇక ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద పరిస్థితులని పరిశీలించి, తరువాత రాజ్ తరుణ్ కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా రాజ్ తరుణ్ కు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పలువురు అయన కుటుంబ సభ్యులు, కొంత ఆందోళనకు గురయ్యారని, అయితే ప్రమాద సమయంలో ఆయనకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: