కోస్తా జిల్లాలలో సంక్రాంతి వచ్చింది అంటే చాలు కోడి పందేల పేరుతో వందల కోట్లు చేతులు మారిపోతాయి. ఈమధ్యన జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల విషయమై కూడ భారీ మొత్తాలలో బెట్టింగ్ లు నడిచాయి. ఇక క్రికెట్ బెట్టింగ్ మాఫియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

అయితే ఎప్పుడూ లేని విధంగా ఒక రెండు భారీ సినిమాల విజయం గురించి అవి సాధించబోయే రికార్డుల గురించి ఇప్పుడు కోస్తా జిల్లాలలో పందేల సంస్కృతి మళ్ళీ మొదలు కావడంతో 5 నెలల తరువాత వచ్చే సంక్రాంతి అప్పుడే వచ్చేసిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రభాస్ చిరంజీవిలు ఇద్దరూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతం వారు కావడంతో పాటు వీరిద్దరికీ గోదావరి జిల్లాలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

దీనితో ‘సాహో’ సైరా’ మూవీ కలక్షన్స్ ను అదేవిధంగా ఓపెనింగ్ రికార్డులను ఆపై ఈ రెండు మూవీల ఫలితాలను ముందుగానే రకరకాల కోణాలలో విశ్లేషణలు చేసి ఈ రెండు సినిమాలు విడుదల కాకుండానే భారీ బెట్టింగ్స్ ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ బెట్టింగ్స్ ను ప్రభాస్ చిరంజీవిల అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులు కూడ ఈ బెట్టింగ్స్ వేస్తున్నట్లు వార్తలు రావడం బట్టి ఈ మూవీల పై పెరిగిపోతున్న అంచనాలు ఎవరికైనా అర్ధం అవుతాయి.

ఈ రెండు సినిమాల బిజినెస్ సుమారు 800 కోట్ల వరకు జరుగుతున్న పరిస్థితులలో కేవలం 32 రోజుల గ్యాప్ లో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాల ఫలితం ఇండస్ట్రీ పై చాల ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. ఈ రెండు సినిమాలు ఊహించిన విధంగా బయ్యర్లకు కాసులు కురిపిస్తే సంక్రాంతికి రాబోతున్న మహేష్ అల్లు అర్జున్ ల మూవీల పై అత్యంత భారీ బిజినెస్ జరిగే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: