ఒక యంగ్ హీరోకి వరస పెట్టి మూడు ఫ్లాపులు వస్తే అక్కడతో అతడి కెరియర్ పరిసమాప్తి అయిపోతుంది. అయితే అఖిల్ కు ఉన్న బ్యాక్ గ్రౌండ్ రీత్యా అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు నటించడానికి టాప్ హీరోయిన్స్ దొరుకుతున్నారు. 

ఎన్నో కథలను విన్న తరువాత మరెన్నో ఆలోచనలు చేసి అఖిల్ ప్రస్తుతం ఇమేజ్ లేని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయి ఒక షెడ్యూల్ కూడ పూర్తి చేసుకుంది. 

అయితే ఈ సినిమాకు సంబంధించి విపరీతమైన హీరోయిన్ కష్టాలు ఎదురయ్యాయి. ఈ మూవీలో ఒక క్రేజీ హీరోయిన్ అఖిల్ పక్కన పెట్టాలి అన్న ఉద్దేశ్యంతో కియారా అద్వాని పూజా హెగ్డే రష్మిక లాంటి క్రేజీ బ్యూటీలను సంప్రదిస్తే వారు పెట్టిన భారీ కండిషన్స్ ఈ మూవీ నిర్మాత అల్లు అరవింద్ కు చుక్కలు కనిపించడంతో ఒక కొత్త హీరోయిన్ కోసం చాల వేట కొనసాగించారు.

అయితే ముంబాయికి చెందిన అనేకమంది యంగ్ హీరోయిన్స్ అఖిల్ తో నటించడానికి ఓకె చెప్పినా వారెవ్వరూ అఖిల్ పక్కన సరిపోరు అని అనిపించినట్లు టాక్. దీనితో మళ్ళీ యూటర్న్ తీసుకుని అఖిల్ కోసం పూజ హెగ్డేను సంప్రదించడమే కాకుండా ఆమెకు ఏకంగా 3.5 కోట్లు పారితోషికం ఆఫర్ చేయడమే కాకుండా ఇప్పటి వరకు పూజ హెగ్డే కెరియర్ లో ఎవరు ఇవ్వని పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే అఖిల్ కు దర్శకులు దొరకడమే కాకుండా పేరున్న హీరోయిన్స్ దొరకడం కూడ ఎంత సమస్యగా మారిందో అర్ధం అవుతుంది. ఈ మూవీ షూటింగ్ లో పూజ హెగ్డే త్వరలో జాయిన్ అవ్వబోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: