యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు 5వ వారం పూర్తి చేసుకుంది. ఇక ఈ సీజన్ బిగ్ బాస్ లో కంటెస్టంట్స్ వారు చేసే హంగామా అంతా తెలిసిందే. ఇదిలాఉంటే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి ఒక్క సెలబ్రిటీ కూడా గెస్ట్ గా రాలేదు.   


ఇస్మార్ట్ శంకర్ రామ్ జస్ట్ బిగ్ బాస్ స్టేజ్ మీద ఉండి హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ తో మాట్లాడాడు. మన్మథుడు 2 కోసం కూడా వెన్నెల కిశోర్ కూడా నాగార్జున దగ్గర ఉండే కంటెస్టంట్స్ తో మాట్లాడలేదు. అయితే ఈ సీజన్ లో మొదటిసారి హౌజ్ లోకి ఓ స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అది ఎవరో కాదు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని తెలుస్తుంది. 


ప్రస్తుతం ప్రభాస్ నటించిన సాహో సినిమా ప్రమోషన్స్ బిజీలో ఉన్నాడు. బాలీవుడ్ లో ఓ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్న ప్రభాస్ ఇక తెలుగులో బిగ్ బాస్ ను కవర్ చేయాలని చూస్తున్నాడట. బిగ్ బాస్ హౌజ్ లో ప్రభాస్ హౌజ్ లోకి వెళ్లి కంటెస్టంట్స్ తో కలిసి ఆట పాటలతో చిందులేస్తాడట. బాహుబలి రాకతో బిగ్ బాస్ హౌజ్ మొత్తం అదిరిపోతుందని అంటున్నారు.   


బిగ్ బాస్ లో ఈ వారం అషు రెడ్డి ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. రాహుల్, పునర్నవి, అషు రెడ్డి, బాబా భాస్కర్ ఈరోజు నామినేషన్స్ లో ఉన్నారు. శనివారం ఆల్రెడీ మహేష్, శివజ్యోతిలను సేఫ్ జోన్ లోకి పంపించాడు నాగార్జున. మరి ఈరోజు అషు వెళ్లడం ఖాయమే అని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం సందడి ఎలా ఉంటుందో మరో రెండు గంటల్లో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: