‘సాహో’ ను ప్రమోట్ చేస్తూ అనేక మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ప్రభాస్ తన వ్యక్తిగత విషయాలను కూడ షేర్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో కొన్ని నెలల క్రితం ఎయిర్ పోర్ట్ లో తనను చూసి పరిగెట్టుకుంటూ వచ్చి తన చేయిని గిల్లి ఆతరువాత తన చెంపను ఆమె చేతితో చిలిపిగా చెంప పై కొట్టిన సంఘటన షాక్ తన జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

ఒక్క క్షణం పాటు అసలు ఏమి జరుగుతోందో తనకు కూడ తెలియని పరిస్థితి ఏర్పడింది అంటూ మరీ ఇంత అభిమానం తన పై పెంచుకుని తనకు వెరైటీ షాక్ లు ఇవ్వవద్దని ప్రభాస్ తన అభిమానులను కోరుకుంటున్నాడు. అదేవిధంగా తనను అనుష్కను లింక్ చేస్తూ వార్తలు వ్రాస్తున్న మీడియాకు కూడ ప్రభాస్ అభ్యర్ధనలు చేసాడు.

అనుష్క గౌరవప్రదమైన ఒక ప్రముఖ నటి అని తన పై కోపం ఉంటే తనను టార్గెట్ చేస్తూ ఎన్ని కామెంట్స్ వ్రాసినా తాను బాధపడను అనవసరంగా అనుష్కను ఎందుకు గాసిప్పుల ఊబిలోకి దింపుతున్నారు అంటూ మీడియాను ప్రశ్నిస్తున్నాడు ప్రభాస్. ఇక మీడియా తన పై చూపిస్తున్న అత్యుత్సాహం పై స్పందిస్తూ ప్రభాస్ వెరైటీ కామెంట్స్ చేసాడు. 

తనను తన అభిమానులు డార్లింగ్ అంటూ పిలుస్తారని అయితే ఆ పిలుపుకు మరొక ట్యాగ్ ను జోడించి ‘న్యూ జనరేషన్ సూపర్ స్టార్’ అంటూ తమిళ మీడియా చేస్తున్న ప్రచారం గురించి ఖంగారు పడుతూ దక్షిణాది సినిమా రంగానికి రజినీకాంత్ ఒక్కరే సూపర్ స్టార్ అంటూ రజినీ అభిమానులకు కోపం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘సాహో’ పై విపరీతమైన అంచనాలు పెరిగిన నేపధ్యంలో ఆ అంచనాలు కొనసాగిస్తూ తనకు ఎటువంటి డామేజ్ లేకుండా ప్రభాస్ చాల తెలివిగా అన్ని భాషల మీడియా వర్గాలను చాల సమయస్పూర్తితో మేనేజ్ చేస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: