5 మిలియన్ డాలర్స్ కలక్షన్స్ టార్గెట్ గా అమెరికాలో విడుదల కాబోతున్న ‘సాహో’ కు ఊహించని షాక్ తగిలింది అని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ ప్రీమియర్ షోలను 29వ తారీకు రాత్రి అమెరికాలో అనేక చోట్ల వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసారు. 

ఈ ప్రీమియర్ షోల టిక్కెట్ల ధరను 25 నుంచి 30 డాలర్ల వరకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘సాహో’ తెలుగు వర్షన్ ప్రీమియర్ షోల టిక్కెట్లు చాల వేగంగా అయిపోతున్నాయి కానీ ‘సాహో’ హిందీ తమిళ మళయాళ  వెర్షన్స్ ప్రీమియర్ షోల టిక్కెట్లు చాల నెమ్మదిగా వెళుతున్నట్లు సమాచారం. 

కేవలం ‘సాహో’ ప్రీమియర్ షోల ద్వారా 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఆతరువాత 5 మిలియన్ డాలర్ల కలక్షన్స్ ను టార్గెట్ చేద్దామని భావిస్తున్న ‘సాహో’ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు జరుగుతున్న పరిణామాలు టెన్షన్ పుట్టిస్తున్నట్లు టాక్. దీనికితోడు ‘సాహో’ ప్రీమియర్ షోల గురించి అమెరికాలోని ఒక్క తెలుగు ప్రేక్షకుడు తప్ప హిందీ తమిళ మళయాళ  ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకుండా ఈమూవీ టాక్ వచ్చాక ఆలోచిద్దాం అంటూ అనుసరిస్తున్న పద్ధతులతో ‘సాహో’ ఓవర్సీస్ కలక్షన్స్ ఊహించిన స్థాయిలో ఉండవా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

అయితే దీనికి భిన్నంగా ‘సాహో’ టిక్కెట్ల మ్యానియా తెలుగు రాష్ట్రాలలో తార స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలలో ఈ సినిమాను మొదటిరోజు చూడాలి అన్న మ్యానియాతో ఈమూవీ ప్రీమియర్ షోలకు వేలు ఖర్చు పెట్టి అయినా సరే ఈ మూవీ చూసి తీరాలి అన్న ట్రెండ్ కనిపిస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ లో కూడ ‘సాహో’ సినిమాకు సంబంధించి మొదటి మూడు రోజులకు ఒక్క టిక్కెట్ కూడ ఎక్కడా దొరకని పరిస్థితి కొనసాగుతోంది. దీనితో ‘సాహో’ టిక్కెట్ల పరిస్థితి ఓవర్సీస్ లో ఒకలా తెలుగు రాష్ట్రాలలో ఒకలా కొనసాగుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: