ఆగస్ట్ 29.. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పుట్టిన రోజు.. అందులోనూ ఇది 60 పుట్టిన రోజు.. ఇప్పటికే సోషల్ మీడియాలో నాగార్జునకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రముఖులంతా టాలీవుడ్ మన్మథుడికి బర్త్ డే విషెష్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. నాగ్ పుట్టినరోజు పురస్కరించుకొని దేవదాస్ స్టిల్ ఒకటి యూనిట్ రిలీజ్ చేసింది. లాంగ్ కోట్, హ్యాట్ పెట్టుకొన్న నాగార్జున చాలా యంగ్ గా కనిపించారు. స్టైలిష్ గా ఉన్న ఈ స్టైల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. వయసుతో పాటు కింగ్ అందం పెరుగుతున్నదని కామెంట్లు వస్తున్నాయి.
మరి ఇంతకీ తన 60 వ పుట్టిన రోజు మరి మన్మథుడు ఎక్కడ ఉన్నారు..? ఆయన హైదరాబాద్ లో మాత్రం లేరు.. అసలు ఇండియాలోనే లేనట్టు తెలుస్తోంది. ఈ పుట్టినరోజు వేడుకలను ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్ స్పెషల్‌గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. యూరప్ దేశాలైన ఎల్బిజియా, స్పెయిన్‌లో నాగ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతున్నారని అంటున్నారు.
కొన్నేళ్ల క్రితం వరకూ నాగార్జున పుట్టినరోజు వేడుకలను ఆయన ఫ్యాన్స్ ఏదోరకంగా సెలబ్రేట్ చేసేవారు. మూడేళ్ళనాడు అనుకోనివిధంగా ఫ్యాన్స్ అధ్యక్షుడు చనిపోవడంతో అప్పటినుంచి వేడుకలు చేసుకోనని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆరోజు పలు సేవా కార్యక్రమాలు చేయమని అభిమానులకు సూచించారు. సరిగ్గా అదే ఆయన ఆచరిస్తున్నారు.
60 ఏళ్లు వచ్చినా నాగార్జున ఇంకా మన్మథుడిగానే మెప్పిస్తున్నారు. తాజాగా వచ్చిన మన్మథుడు 2 అంతగా ఆడకపోయినా.. సోగ్గాడే చిన్నినాయనా అంటూ మరోసారి ముందుకు వస్తున్నాడు.. వయస్సు పెరుగుతున్నా.. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేసుకుంటూ పోవడంలో నాగార్జున ముందుంటాడు.. పాత హీరోల్లో ఇప్పటికీ అందం నిలబెట్టుకున్న హీరో నాగార్జున ఒక్కడే కావడం విశేషం. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నాగార్జున న్యూ టాలెంట్‌ను అందిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ నుంచి నిన్నటి కళ్యాణ కృష్ణ కురసాల వరకు దాదాపు 12 మంది దర్శకులకు అవకాశం కల్పించారు. నాగ్ ఎక్కడ ఉన్నా.. సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆశిద్దాం..