మాటల మాంత్రికుడు త్రివిక్రం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఆగష్టు 15న ఓ చిన్న టీజర్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన బన్ని ఈరోజు స్పెషల్ గా పోస్టర్ తో వచ్చాడు.


ఇక ఈ పోస్టర్ చూస్తే త్రివిక్రం మార్క్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఓ పెద్ద బిల్డింగ్ దాని ముందు ఓ పెద్ద కారు.. వాటికి ఏమాత్రం సంబంధం లేకుండా కారు పక్క స్టూల్ మీద సూటు బూటు వేసుకుని సిగరెట్ కాల్చుతున్న హీరో. ఆ సిగరెట్ ను వెలిగిస్తున్న వాచ్ మెన్ ఇలా పోస్టర్ లో అబ్సర్వ్ చేయాల్సినవి చాలానే ఉన్నాయ్.     


అల వైకుంఠపురములో ఇదో తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో కూడిన కథతో వస్తుందట. సినిమాలో టబు, జయరామ్ లు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. 2020 సంక్రాంతికి సందడి చేయనున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు అలరిస్తున్నాయి. మరోసారి త్రివిక్రం తన పెన్ పవర్ చూపించేలా సినిమా ఉంటుందని చెప్పొచ్చు.  


ఆల్రెడీ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా ఖర్చీఫ్ వేశాడు. ఈసారి పొంగల్ వార్ లో బన్ని కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. కచ్చితంగా ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పొచ్చు. సరిలేరు డైరక్టర్ అనీల్ రావిపుడి వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. అలాంటి డైరక్టర్ కు మహేష్ లాంటి హీరో దొరికాడు. తప్పకుండా మహేష్ తో అనీల్ అదరగొట్టే సినిమా చేస్తాడని అంటున్నారు. మరి బన్ని వర్సెస్ మహేష్ లలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: