ఆరెక్స్ 100 సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన మొదటి సినిమాతోనే తన కసి ఏంటో చూపించాడు. ఆర్జీవి శిష్యుడైన అజయ్ ఏకంగా గురువుకే షాక్ ఇచ్చేలా సినిమా తీశాడు. ఆరెక్స్ 100 సినిమాతో కార్తికేయకు, పాయల్ రాజ్ పుత్ కు మంచి ఛాన్స్ లు వస్తున్నాయి. ఇక ఆరెక్స్ 100 తర్వాత అజయ్ భూపతి ఓ కథ పట్టుకుని చాలా హీరోలకు చెప్పాడు.   


ముందు నితిన్, ఆ తర్వాత రామ్ ఇలా ఒకరిద్దరు హీరోల దగ్గరకు వెళ్లి తన కథ చెప్పాడట. అయితే కథ విన్న వారు బాగుందని చెప్పి మళ్లీ తర్వాత కలుద్దాం అన్నారట. అయితే మాస్ మహరాజ్ రవితేజ మాత్రం అజయ్ భూపతి చెప్పిన కథను ఓకే చేశాడట. మహా సముద్రం టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాను జెమిని కిరణ్ నిర్మించాలని అనుకున్నారు.      


కథ ఓకే.. హీరో ఓకే.. నిర్మాత ఓకే.. డైరక్టర్ డబుల్ ఓకే కాని మధ్యలో హీరో రెమ్యునరేషన్ దగ్గర సినిమా క్యాన్సిల్ అయ్యిందట. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు అతను అడిగినంత ఇచ్చేందుకు నిర్మాత సుముఖంగా లేరట. లాస్ట్ మినిట్ లో ఈ ప్రాజెక్ట్ తాను చేయనని అన్నాడట హీరో. కేవలం రెమ్యునరేషన్ వల్లే రవితేజ ఈ సినిమా వద్దనుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.     


అందుకే డైరక్టర్ అజయ్ భూపతి చీప్ స్టార్ అని ఆ హీరోని ఉద్దేశించి పెట్టాడని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. సినిమా కాదన్నంత మాత్రాన హీరో ఇమేజ్ ను డ్యామేజ్ చేసే స్టేట్ మెంట్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుంది. చీప్ స్టార్ కామెంట్ పై రవితేజ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.      
 


మరింత సమాచారం తెలుసుకోండి: