మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకతంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం వాల్మీకి. ఇటీవల తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. నిజానికి తమిళంలో మంచి సక్సెస్ సాధించిన ఆ సినిమాను తెలుగులో కొన్ని మార్పులు చేర్పులు చేసి దర్శకుడు హరీష్ శంకర్ ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు అధర్వ మురళి, తమిళ నటి మృణాళిని రవి, బ్రహ్మాజీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాలోని రెండు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతల నుండి విశేషమైన స్పందనను రాబట్టాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రేపు సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇక మరోవైపు యంగ్ హీరో గోపీచంద్ హీరోగా తీరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ చాణక్య. అనిల్ సుంకర సమర్పణలో సుంకర రామబ్రహ్మం నిర్మాతగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి అవ్వగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. నిజానికి ఎప్పుడో పూర్తి కావలసిన ఈ సినిమా, 

మధ్యలో హీరో గోపీచంద్ కు కొద్దిపాటి గాయం కారణంగా మధ్యలో కొన్నాళ్ళు షూటింగ్ వాయిదా పడడం జరిగింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమా యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రేపు సాయంత్రం 4 గం. 5 ని. లకు యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఒక ప్రకటన రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ఈ విధంగా ఈ రెండు సినిమాలు ట్రైలర్, మరియు టీజర్ రిలీజులతో రేపు సాయంత్రం పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్నమాట. అయితే ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో, రేపు రిలీజ్ కానున్న ఈ రెండు సినిమాల ట్రైలర్, టీజర్ లు మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: