60 ఏళ్లు వచ్చినా ఇప్పటికి నవ యువ మన్మథుడిగా ఉంటాడు కింగ్ నాగార్జున. ఎంతమంది హీరోలు ఉన్నా ఇప్పటికి నేటి తరం స్టార్స్ కు పోటీగా క్రేజీ మూవీస్ చేస్తుంటాడు నాగ్. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా స్టార్స్ కు గట్టి పోటీ ఇస్తాడు. హీరోగా వెండితెర మీదనే కాదు హోస్ట్ గా బుల్లితెరను షేక్ చేశాడు నాగార్జున. మీలో ఎవరు కోటీశ్వరుడు షో హోస్ట్ గా నాగార్జున అదరగొట్టాడు. 


ఆ అనుభవంతోనే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3ని హోస్ట్ చేస్తున్నాడు. 8 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 3లో ఈ శనివారం ఉన్నంత సీరియస్ గా నాని ఎప్పుడు లేడని చెప్పొచ్చు. రావడం రావడమే ఎంట్రీ సాంగ్ చేసే మూడ్ లేదని.. వెంటనే హౌజ్ మెట్స్ తో మాట్లాడాలని మన టివిలోని వెళ్లాడు నాగార్జున. 


కంటెస్టంట్స్ అందరికి షాక్ ఇస్తూ షూ తీసి పాలిష్ చేశాడు నాగ్. ఆ సీన్ చూస్తే ఒక్కసారిగా స్వయంకృషి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గుర్తుకు వచ్చారని చెప్పొచ్చు. తమ పని తాము చేసుకోవడం వల్ల ఎలాంటి తప్పు ఉండదని. పనులు చిన్నవైనా వాటిని చేసే పద్ధతిలో చేస్తే స్థాయి తగ్గదని అన్నాడు నాగార్జున. ఇదంతా పునర్నవి, మహేష్ లు షూ పాలిష్ టాస్క్ లో చేసిన అతికి నాగార్జున పంచ్ ఇచ్చాడు. నాగార్జున షూ పాలిష్ చేస్తుంటే హౌజ్ మెట్స్ అంతా క్లాప్స్ కొట్టారు. 


శ్రీముఖి మీద కూడా ఈ ఎపిసోడ్ లో ఫైర్ అయ్యారు నాగార్జున. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు నీ ఆట నువ్వు ఆడుకో శ్రీముఖి నువ్వు బిగ్ బాస్ వి కావు హౌజ్ మెట్స్ ను మ్యానిపులేట్ చెయొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇక హిమజ, మహేష్, శ్రీముఖి, శిల్పా చక్రవర్తి, పునర్నవిలలో శనివారం ఎపిసోడ్ లో హిమజని సేఫ్ చేశారు నాగార్జున. ఈ వారం ఎలిమినేషన్ ఎవరన్నది ఆదివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: