సినీ రంగంలో పనిచేసే రచయిత నుండి సాంకేతిక నిపుడి వరకు దర్శకుడిగా మారాలని కళలు కంటూనే ఉంటారు. ఇలాంటి కల టాప్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకు కూడ ఉందట. నిన్న ‘సైరా’ ను ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రత్నవేలు తన కెరియర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  

తనకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీన‌న్‌ పీసీ శ్రీరామ్ లా దర్శుకుడు కావాలని ఎప్పటినుంచో కలలు కంటున్న విషయాలను వివరించాడు. వాస్తవానికి తాను ఏడేళ్ల కింద‌టే ద‌ర్శ‌కుడిగా మారవలసి ఉన్నప్పటికి  ఆ స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పిలిచి ‘రోబో’ సినిమా చేయమని చెప్పడంతో తన ఆలోచనలు వాయిదా వేసుకున్న విషయాలను వివరించాడు. 

ఆ తరువాత ‘రంగస్థలం’ మూవీ ఆపై ‘సైరా’ న‌ర‌సింహారెడ్డి లాంటి మెగా ప్రాజెక్టు మందుకు రావ‌డంతో తన దర్శకత్వ ఆలోచనలు ఆగిపోయిన విషయాన్ని వివరించాడు. అంతేకాదు చరణ్ తన దర్శకత్వ ఆలోచనలు గ్రహించి కెరియర్ మంచి పీక్ లో ఉండగా అలాంటి ప్రయత్నాలు చేయవద్దని సలహాలు ఇచ్చిన విషయాన్ని తెలియచేసాడు.   

ప్ర‌స్తుతం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ చిత్రానికి ప‌నిచేస్తున్నాన‌ని ఆత‌ర్వాత ‘భార‌తీయుడు 2’ చేయాల్సి ఉంద‌ని ఆపై అయినా ద‌ర్శ‌కుడిగా సినిమా మొద‌లు పెట్టాల‌నుకుంటున్నాన‌ని తన స్థిర ఆలోచనలు బయటపెడుతూ తన వద్ద క‌థ కూడా రెడీ అయింద‌ని చెపుతున్నాడు. అయితే ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో ఏ భారీ సినిమా మొదలుపెట్టినా అందరికీ ర‌త్న‌వేలు మాత్రమే కావలసి ఉన్న నేపధ్యంలో ఈయన కోర్కెలు ఎప్పటికి తీరుతాయి అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. ప్రస్తుతం  ‘సైరా’ కు సంబంధించి ఇతడు తీసిన అద్భుత ఫోటో గ్రాఫి పై చర్చలు జరుగుతున్న  నేపధ్యంలో ఈమూవీ తరువాత రత్నవేలు ఖ్యాతి మరింత పెరిగే ఆస్కారం ఉంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: