‘డియర్ కామ్రేడ్’ పరాజయం తరువాత విజయ్ దేవరకొండ  క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ స్క్రిప్ట్ లో చాల మార్పులు జరిగాయి. ఇప్పటికే చాల భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి ఎవరు ఊహించని టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అన్న టైటిల్ ను ఈరోజు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ ను అనేక ఆలోచనలు తరువాత విజయ్ దేవరకొండ సూచనలతో ఫిక్స్ చేసినట్లు టాక్. రాశి ఖన్నా ఐశ్వర్యా రాజీవ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో కూడ విజయ్ మార్క్ లిప్ లాక్ సీన్స్ ఉండబోతున్నాయి.

అయితే ఈ సినిమా తరువాత ఇలాంటి లిప్ లాక్ సీన్స్ ఇక నటించను అని విజయ్ ఓపెన్ గా చెపుతున్న పరిస్థితులలో ఈ యంగ్ హీరో లిప్ లాక్ సీన్స్ కు సంబంధించి ఆఖరి సినిమాగా ఈమూవీ రికార్డ్ క్రియేట్ చేసే ఆస్కారం కనిపిస్తోంది. విజయ్ సినిమాలు యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ గా ఉంటాయి కాబట్టి ఇలాంటి కొత్త వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేసి ఈ మూవీకి క్రేజ్ ను తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.    

ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించే సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన మేకోవర్ పై విజయ్ దృష్టి పెడతాడని సమాచారం. గతంలో విజయ్ సినిమాలకు సంబంధించిన కథలను వినే పని కేవలం అతడి తండ్రి మాత్రమే చేసేవాడు. అయితే కథల ఎంపిక విషయంలో తన తండ్రి కన్ఫ్యూజ్ అవుతున్న విషయాన్ని గ్రహించిన విజయ్ ఈ కథలను విని ఫిల్టర్ చేయడానికి తన తండ్రితో కలిపి ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసుకుని భవిష్యత్ లో తన కథల ఎంపిక విషయంలో ఎటువంటి పొరపాట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: