నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. లాస్ట్ ఫ్రైడే రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తుంది. సినిమా రిలీజ్ రోజు మిక్సెడ్ టాక్ వచ్చినా తర్వాత అందరు బాగుందనేస్తున్నారు. సినిమాకు వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇదిలాఉంటే ఈ వారం రాబోతున్న వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా గురించి నాని టెన్షన్ పడుతున్నాడు.


గ్యాంగ్ లీడర్ కు టాక్ ఎలా ఉన్నా వసూళ్లు బాగున్నాయి.. అయితే మెగా హీరో సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం గ్యాంగ్ లీడర్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తప్పకుండా వాల్మీకి టాక్ పై గ్యాంగ్ లీడర్ కలక్షన్స్ డిపెండ్ అయ్యి ఉంటాయని చెప్పొచ్చు. హరీష్ శంకర్ డైరక్షన్ లో తెరకెక్కిన వాల్మీకి సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతుంది.       


ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో పూజా హెగ్దె స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇక సినిమాలో కోలీవుడ్ హీరో అధర్వ, మృణాలిని కూడా నటించారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవనుంది.


వాల్మీకి హిట్ టాక్ వస్తే కనుక నాని గ్యాంగ్ లీడర్ మీద కచ్చితంగా ప్రభావం చూపించొచ్చు. 29 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన గ్యాంగ్ లీడర్ 5 రోజుల్లో 13.5 కోట్ల దాకా రాబట్టిందని తెలుస్తుంది. ప్రాజెక్ట్ సేఫ్ అవ్వాలంటే మరో 15 కోట్లు రాబట్టాల్సి ఉంది. మరి వాల్మీకి మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ రెండు మూడు రోజుల్లో నాని ఎంతవరకు సేఫ్ అవుతాడో చూడాలి. ఒకవేళ వాల్మీకి అనుకున్న రేంజ్ లేకుంటే మాత్రం గ్యాంగ్ లీడర్ కు ఇక తిరుగు ఉండదు.



మరింత సమాచారం తెలుసుకోండి: