విజయ్ దేవరకొండ సినిమా చూడాలంటే తెలుగు రాకపోయినా పర్వాలేదు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయి ఉండాలి. సెకండ్ లాంగ్వేజ్ హిందీ కంపల్సరీ. లేకపోతే.. విజయ్ సినిమా గురించి ఆలోచించడం కష్టమైపోతుంది. తెలుగు హీరో సినిమా చూడటానికి ఇతర భాషలతో సంబంధం ఉండాలని దీన్ని బట్టి అర్థమైపోతోంది. 


విజయ్ దేవరకొండ తెలుగు టైటిల్ ఉన్న సినిమాలో నటించి చాలా కాలం అయింది. పెళ్లిచూపులు.. ద్వారక.. గీతగోవిందం లాంటి అచ్చమైన తెలుగు టైటిల్స్ విజయ్ దేవరకొండ సినిమాకు ఈ మధ్య కనిపించడం లేదు. గీత గోవిందం తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఇంగ్లీష్.. హిందీ టైటిల్సే. నోటా.. డియర్ కామ్రేడ్ తర్వాత మరోసారి ఇంగ్లీష్ టైటిల్ తో వస్తున్నాడు ఈ క్రేజీ యంగ్ హీరో.


డియర్ కామ్రడ్ తర్వాత నటిస్తున్న సినిమాకు "వరల్డ్ ఫేమస్ లవర్"  అన్న టైటిల్ ఖరారు చేశారు. "మళ్లీ మళ్లీ ఇది రాని రోజు" తీసిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.యస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చిన తర్వాత టైటిల్ అనౌన్స్ చేశారు. ఇంగ్లీష్ టైటిల్స్ షార్ట్ కట్ ఉంటాయి. కానీ.. "వరల్డ్ ఫేమస్ లవర్" అంటూ లాంగ్ టైటిల్ ను పెట్టాడు దర్శకుడు. 


వరల్డ్ ఫేమస్ లవర్ లో నలుగురు హీరోయిన్స్ రాశీకన్నా.. ఐశ్వర్యా రాజేష్.. కేథరిన్ థెరిస్సా.. ఇజబెల్లీ నటిస్తున్నారు. ఇంతమందిని చూస్తుంటే.. హీరో వరల్డ్ ఫేమస్ రోమియాగా అనిపిస్తున్నాడు. మరి దర్శకుడు విజయ్ ను "వరల్డ్ ఫేమస్ లవర్"  అంటున్నాడు. మరి ఆ లవర్ ఎలా ఉంటాడో చూడాలి. సినిమా ఫస్ట్ లుక్ ను 20న రిలీజ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ అందరిలా రొటీన్ గా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమై హావభావాలతో యూత్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. మరి నిజంగానే వరల్డ్ ఫేమస్ లవర్ గా మెప్పిస్తాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: