మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వాల్మీకి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మించారు. సినిమాలో వరుణ్ తేజ్ తో పాటుగా తమిళ హీరో అధర్వ, పూజా హెగ్దె, మృణాళిని నటించారు. వీరే కాదు సినిమాలో స్పెషల్ సర్ ప్రైజ్ గా తెలుగు యంగ్ హీరో ఉంటాడట.     


అతనెవరో కాదు యువ హీరో నితిన్ వాల్మీకిలో చిన్న కెమియో రోల్ చేశాడని అంటున్నారు. రిలీజ్ రేపనగా వాల్మీకి టీం ఇచ్చిన ఈ ట్విస్ట్ మెగా ఫ్యాన్స్ ను భలే సర్ ప్రైజ్ చేసింది. మెగా హీరో సినిమాలో మెగా ఫ్యాన్ అది కూడా క్రేజీ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇంతకీ నితిన్ సినిమాలో ఎలా కనిపిస్తాడు అన్నది మాత్రం సస్పెన్సే.


వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ గా నటించిన ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీమేక్ గా తెరకెక్కింది. సినిమాలో వరుణ్ తేజ్ లుక్ క్రేజీగా ఉంది. సినిమాలో పూజా హెగ్దెతో ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ రీమిక్స్ చేశారు. ఈ ఇయర్ ఆల్రెడీ ఎఫ్-2 హిట్ తో సూపర్ జోష్ లో ఉన్న వరుణ్ ఈ సినిమాతో కూడా హిట్టు కొట్టేలా ఉన్నాడు.


సినిమాలో వరుణ్ రెండు వేరియేషన్స్ లో అదరగొడతాడని తెలుస్తుంది. జిగుర్తండా రీమేక్ కాబట్టి సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు. ఇక సినిమాలో నితిన్ కూడా ఉన్నాడని తెలిసి మెగా ఫ్యాన్స్ మరింత సంబరపడుతున్నారు. మరి వరుణ్ తేజ్ వాల్మీకితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.  వరుణ్ తేజ్ మాత్రం ఈ సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడు. సినిమాలో నెగటివ్ రోల్ గా వరుణ్ తేజ్ తన నట విశ్వరూపం చూపించాడని తెలుస్తుంది.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: