‘సాహో’ ఫెయిల్ అయినప్పటికీ ప్రభాస్ ఇమేజ్ బాలీవుడ్ లో ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు అతడికి బాలీవుడ్ లో అవకాశాలు చాల విపరీతంగా వస్తున్నాయి. దీనితో నేషనల్ సెలెబ్రెటీగా ఎదగాలి అన్న ప్రభాస్ ఆశలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అమ్మాయిలలోనే కాకుండా మహిళలలో కూడ క్రేజ్ బాగా పెరిగిపోతోంది అని తెలియచెప్పే ఒక ఆసక్తికర సంఘటన ఈమధ్య జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ‘సాహో’ లో నెగిటివ్ పాత్రను పోషించిన చుంకీ పాండే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు. 

ఈమధ్య ఒక నడివయసు ఉన్న ఒక మహిళ తన దగ్గరకు వచ్చి తనను చెప్పుతో కొట్టిన సందర్భాన్ని వివరించాడు. దీనికి కారణం చుంకీ పాండే ‘సాహో’ లో నటించిన ఒక సీన్ అని తెలుస్తోంది. అయితే ఈ సీన్ లో ప్రభాస్ ను చంపేందుకు చుంకీ పాండే ప్రయత్నిస్తూ ప్రభాస్ మెడను విరుస్తాడు.  అయితే హీరో కాబట్టి ప్రభాస్ ఏమీ కాకుండా తప్పించుకుంటాడు.  కానీ ఈ సీన్ చూసిన ఆ మహిళకు విపరీతమైన కోపం వచ్చి ముంబాయిలోని ఒక మాల్ లో చుంకీ పాండేని వెంటాడి తన చెప్పుతో కొట్టి అతడికి షాక్ ఇచ్చిందట. 

దీనితో ప్రభాస్ తో విలన్ పాత్రలో నటించే ముందు నటులు చాల ముందు చూపుతో జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ జోక్ చేసాడు.  ఇలాంటి పరిస్థితులలో ఈ బాలీవుడ్ యాక్టర్ చెప్పిన విషయాలను బట్టి రెండు అంశాలు అర్ధం అవుతాయి. వాటిలో ఒకటి ప్రభాస్ క్రేజ్ అయితే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ ను హిందీ ఆడియన్స్ తమ సొంత హీరోలా ఎలా భావిస్తున్నారో అర్ధం కావడమే కాకుండా ప్రభాస్ కు బాలీవుడ్ లో పెరుగుతున్న మ్యానియా ఆదరికీ తెలిసింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: