‘సైరా’ ను ప్రమోట్ చేస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న చిరంజీవికి పవన్ కళ్యాణ్ విషయమై కూడ అనేక ఆసక్తికర ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. వాస్తవానికి తనకు పవన్ కు మధ్య ఎప్పుడు ఎటువంటి గ్యాప్ ఏర్పడలేదని అయితే మీడియా ఏవేవో ఊహించుకుంటూ తమ ఫోటోలు పెట్టి వార్తలు రాస్తుంది అంటూ మీడియా పై తన అసంతృప్తిని బయటపెట్టాడు.
ఇదే సందర్భంలో రాజకీయాల విషయమై తనకు తన తమ్ముడికి ఉన్న తేడా గురిచి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తాను కెరియర్ లో పూర్తిగా సెటిల్ అయిపోయి ఆర్ధికంగా బాగా సంపాదించిన తరువాత రాజకీయాలలోకి వస్తే సినిమాలోకి వస్తే ఆర్ధికంగా ఇంకా పూర్తిగా సెటిల్ కాకుండానే పవన్ రాజకీయాలలోకి వచ్చిన తేడాను వివరించాడు. అంతేకాదు తనతో పోల్చుకుంటే పవన్ కు అతడి పిల్లలకు సంబంధించి నెరవేర్చ వలసిన ఎన్నో భాధ్యతులు ఉన్నా వాటిని పవన్ పట్టించుకోడు అంటూ కామెంట్స్ చేసాడు.
అంతేకాదు తాను ఒక స్థాయికి వచ్చిన తరువాత సమాజం రాజకీయాల గురించి ఆలోచనలు చేసానని అయితే పవన్ తన చిన్న తనం నుండి సమాజం గురిచి ప్రజల సమస్యల గురించి ఎంతో ఆవేదన పడుతూ నిరంతరం ఘర్షణకు లోనైన విషయాన్ని బయటపెట్టాడు. వాస్తవాకి పవన్ సినిమాల కంటే సమాజాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు అంటూ ఆవిషయాన్ని చాలమంది గుర్తిచకపోవడం తనకు ఆవేదన కలిగిస్తున్న విషయాన్ని తెలియచేసాడు.
ప్రజల అవకాశం ఇస్తే పవన్ అద్భుతంగా ప్రజాసేవ చేస్తూ పరిపాలించగల దక్షత గల వ్యక్తి అని అంటూ ఆ వాస్తవాని ప్రజలు ఎప్పటికైనా గుర్తిస్తారు అన్న నమ్మకం తనకు ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. అయితే పరిస్థితులకు ఎదురు ఈదుతూ నిరంతర పోరాటం చేస్తున్న పవన్ ను చూస్తూ ఉంటే ఒక వైపు గౌరవం మరో వైపు భయం పెరిగిపోతున్నాయి అంటూ తన తమ్ముడు పవన్ పై ప్రేమను చిరంజీవి వ్యక్త పరుస్తున్నాడు..