టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ‘చిరుత’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా లవ్, సెంటిమెంట్, మాస్ ఎలిమెంట్స్ తో తిసినా పెద్దగా గుర్తింపు రాలేదు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డులు క్రియేట్ చేసింది. అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టింది. తెలుగు తెరపై రాంచరణ్ నటించిన సినిమాలు ఒకటీ రెండు తప్పా అన్ని సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నవే. గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ మూవీలో రాంచరణ్ చెవిటి వాడి పాత్రలో తన విశ్వరూపం చూపించాడు.
రాంచరణ్ హీరోగా కొనసాగుతూనే వ్యాపార రంగంలో అడుగు పెట్టాడు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ట్రూజెట్ ఎయిర్‌వేస్ సంస్థ పలు సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఖైదీ నెంబర్ 150 తో నిర్మాత బాధ్యతలు కూడా చెపట్టడం మొదలు పెట్టాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన రాంచరణ్ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దక్కించుకున్నట్లు సమాచారం.
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'లూసిఫర్' మాలీవుడ్ లో ఘన విజయాన్ని దక్కించుకుంది. పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లో ఉన్న ఈ మూవీ మోహన్ లాల్ కెరీర్ లో దిబెస్ట్ మూవీగా చెబుతారు. కాగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ దక్కించుకున్నాడట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడని చెప్పుకుంటున్నారు. అంతా సెట్ అయితే..ఈ మూవీ కూడా మెగాస్టార్ తో చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గుస గుస లు వినిపిస్తున్నాయి.