కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్
విక్రమ్ కథ నచ్చితే ఎటువంటి పాత్ర చేయడానికైనా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. తాజాగా మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు విక్రమ్. తన కొత్త సినిమాలో ఏకంగా 25 గెటప్స్ లో కనిపించబోతున్నాడు.
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విక్రమ్. చెన్నైలో ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా ఈ సినిమాలో
విక్రమ్ 25 గెటప్స్ లో కనిపించనున్నాడు.
అందుకోసం యూరప్ నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టులను తీసుకొచ్చారు. వారు నాలుగు నెలలపాటు ఇక్కడే ఉండొచ్చు.
విక్రమ్ కు రకరకాల గెటప్స్ వేస్తారన్నమాట. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. గతంలో విక్రమ్…అపరిచితుడు సినిమాలో చేసిన నటన ఇప్పటికి అందరికి గుర్తుండే ఉంటుంది. పోలీస్ లాకప్‌లో ప్రకాశ్ రాజ్‌తో సీన్‌లో నటవిశ్వరూపం చూపించాడు విక్రమ్.
విక్రమ్.. నిన్నటి తరం నటుల్లో ఈయన శైలి వైవిధ్యం. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘విలన్’, ‘మల్లన్న’, ‘ఐ’.. ఇలా ఒక్కో సినిమా ఒక్కో రకం. తమిళ ప్రేక్షకులతో చియాన్ అని పిలిపించుకుంటోన్న విక్రమ్.. తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించారు. అయితే, ఈ మధ్య
విక్రమ్ కాస్త వెనకబడిపోయారు. ఇటీవల వచ్చిన ‘సామి 2’ సినిమా కూడా ఆశించస్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో తనలోని వైవిధ్యమైన నటుడిని మరోసారి ప్రేక్షకులకు చూపించడానికి
విక్రమ్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సినిమాను
విక్రమ్ అంగీకరించారు. 2020 వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక విభాగం వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా, యువ దర్శకుడైన
అజయ్ జ్ఞానముత్తు తమిళంలో ‘డిమాంటి కాలనీ’, ‘ఇమైకా నొడిగల్’ చిత్రాలను తెరకెక్కించారు. ఇవి రెండూ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘ఇమైకా నొడిగల్’ సినిమా తెలుగులో ‘అంజలి సీబీఐ’గా అనువాదమైంది. ఇందులో
నయనతార ముఖ్య పాత్ర పోషించారు.