కోలీవుడ్ హీరో విజయ్ అక్కడ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోగా తెలుగులో మాత్రం అతనికి పెద్దగా క్రేజ్ రాలేదని చెప్పాలి. తన సినిమాలన్ని తెలుగులో రిలీజ్ చేయాలని చూస్తున్న విజయ్ ఆ సినిమాలతో ఆశించిన ఫలితాలను అందుకోవట్లేదు. ఇక లేటెస్ట్ గా విజయ్ బిగిల్ సినిమా చేస్తున్నాడు. అట్లీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు తెలుగు టైటిల్ ఫిక్స్ చేశారు.  


తెలుగులో ఈ సినిమా విజిల్ గా రాబోతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ఇళయదళపతి విజయ్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి యంగ్ ఏజ్ గెటప్ కాగా మరోటి మిడిల్ ఏజ్ గెటప్.. తండ్రి కొడుకులుగా విజయ్ కనిపిస్తున్నాడు. విజయ్ విజిల్ తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.  


అట్లీ డైరక్షన్ లో విజయ్ తెరి, మెర్సల్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 27న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను మహేష్ ఎస్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమాలైతే రిలీజ్ చేస్తున్నా విజయ్ ఇప్పటివరకు ఇక్కడకు వచ్చి ప్రమోట్ చేసింది లేదు. 


కేవలం ఆ సినిమా దర్శకులే వచ్చి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనే వారు. అయితే ఈసారి ఎలాగైనా మహేష్ కోసం విజయ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సినిమా తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంటుందని అంటున్నారు. విజయ్ కు తెలుగులో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ విజిల్ తో సంచలన విజయం అందుకోవాలని చూస్తున్నాడు. ఇదవరకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న రజిని, కమల్, సూర్య, కార్తిల  సినిమాలు కూడా ఈమధ్య పెద్దగా ఆడట్లేదు. మరి ఇలాంటి టైంలో విజయ్ తెలుగులో తన సత్తా చాటుతాడేమో చూడాలి.      


మరింత సమాచారం తెలుసుకోండి: