సంక్రాంతి వచ్చింది అంటే సినిమాల సందడి ఉన్నట్టే. న్యూ ఇయర్ లో వచ్చే మొదటి పండుగ కాబట్టి సినిమాల హంగామా ఉంటుంది. సంక్రాంతి స్టార్ సినిమాల జోరు మాములుగా ఉండదు. ఈసారి పొంగల్ వార్ లో నువ్వా నేనా అంటున్నారు సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నా పేరు సూర్య తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు బన్ని.  


ఇక భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న డైరక్టర్ అనీల్ రావిపుడి మహేష్ తో కూడా సెన్సేషనల్ హిట్ కొట్టేలా ఉన్నాడు.


2020 సంక్రాంతికి ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండేలా ఉంది. అటు మహేష్ ఫుల్ ఫాంలో ఉండగా ఇటు బన్ని తనకు ఆల్రెడీ రెండు హిట్లు ఇచ్చిన డైరక్టర్ తో హిట్ పై నమ్మకంగా ఉన్నాడు. అల వైకుంఠపురములో సినిమా పోస్టర్స్, సాంగ్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచాయి. జులాయి, సనాఫ్ సత్యమూర్తి తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రం మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉన్నారు.   


సరిలేరు నీకెవ్వరులో మహేష్ కూడా కొంతకాలంగా తన సినిమాల్లో మిస్సైన మాస్ ఎలిమెంట్స్ అన్ని పుష్కలంగా ఉండేలా చూసుకుంటున్నాడు. అదీగాక ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడిగా అనీల్ రావిపుడికి మంచి పేరు ఉంది. మరి మహేష్, అల్లు అర్జున్ బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. చూస్తుంటే రెండు సినిమాలు హిట్టు కొట్టే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా.. సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్న కథానాయికగా చేస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: