నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా గ్యాంగ్ లీడర్. ఇటీవల మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలి రోజు మంచి టాక్ ని సంపాదించినప్పటికీ, ఆ తరువాత నుండి మాత్రం మెల్లగా ముందుకు సాగుతూ తక్కవ స్థాయిలో కలెక్షన్స్ ని సాధిస్తూ ముందుకు సాగింది. ఒక సాధారణ రివెంజ్ డ్రామాని ఆకట్టుకునే విధంగా, మంచి ఎంటర్టైనింగ్ అంశాలు మిళితం చేసి దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించినప్పటికీ, 

విక్రమ్ నుండి ఆశించే వెరైటీ అంశాలు ఈ సినిమాలో లేకపోవడంతో సినిమా పెద్దగా ముందుకు సాగలేదని, అలానే చివర్లో సినిమాకు ప్రమోషన్ కూడా సరిగా చేయకపోవడం కూడా సినిమాకు నష్టం చేసిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయి 28 రోజులు గడవగా, ఆల్మోస్ట్ క్లోసింగ్ సమయానికి ఈ సినిమా కలెక్షన్స్ చేరుకోవడంతో, సినిమా నిర్మాతలు గతంలో డిజిటల్ హక్కుల విషయమై చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఈ సినిమాను నేడు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయడం జరిగింది. అయితే ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా కొన్ని థియేటర్స్ లో ఈ సినిమా అందుతుండడంతో, 

నిర్మాతలకు అప్పుడే ఏమి తొందరొచ్చిందని ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ చేసారు, వారికి ఈ కొద్దిరోజులు సినిమాకు వచ్చే కలెక్షన్స్ వద్దా అంటూ, కొందరు ప్రేక్షకులు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ సినిమా విషయమై నెగటివ్ కామెంట్స్ చేసినందువల్లనో ఏమో తెలియదుగాని, అలా అమెజాన్ ప్రైమ్ లో పెట్టిన ఈ సినిమాని కేవలం కొన్ని గంటల్లోనే తీసేయడం జరిగింది. అయితే ఆ కొద్దిసేపటిలోనే పలు పైరసీ వెబ్ సైట్ లు ఈ సినిమాను మంచి డిజిటల్ రెసొల్యూషన్స్ లో డౌన్ లోడ్ చేసినట్లు సమాచారం. సినిమాను తొందరపడి ప్రైమ్ లో రిలీజ్ చేయడం దేనికి, దాని పై ప్రేక్షకులు రాద్దాంతం చేయడంతో మళ్ళి తీసివేయడం దేనికని, కాబట్టి ఈ విధంగా కూడా గ్యాంగ్ లీడర్ కు ఇబ్బందులు తప్పలేదని కొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తుండడం గమనార్హం.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: