టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన భారీ హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే.  తన కెరీర్లో తొలిసారి స్వాతంత్రోద్యమ వీరుడి పాత్ర పోషించిన మెగాస్టార్ చిరంజీవి, ఆ క్యారెక్టర్ లో ఎంతో ఒదిగిపోయి అత్యద్భుతంగా నటించారు. అయితే సినిమాలోని కథ, కథనాలను ప్రేక్షకుల నాడి పట్టుకునే విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా వరకు విఫలమైనట్లుగా పలువురు ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో గ్రాఫిక్స్ మరియు విజువల్స్, సెట్టింగ్స్, యాక్షన్ సీన్స్ వంటివి ఎంతో అత్యద్భుతంగా ఉన్నాయని, అయితే దర్శకుడు స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ పెట్టి ఉంటె, సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధించి ఉండేదని అంటున్నారు.

ఇక ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా చాలాచోట్ల ఎంతో మెల్లగా నత్తనడకన ముందుకు సాగుతున్న ఈ సినిమా, అటు నార్త్ లో కూడా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నట్లు అక్కడ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దానికి ఒక కారణం కూడా ఉందట,  విషయం ఏంటంటే, అదే రోజున బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమా తొలిరోజు నుండి మంచి టాక్ ను సంపాదించడంతో, అక్కడి మీడియా సహా సినిమా థియేటర్ల యజమానులు, 

ప్రేక్షకులు సైతం ఎక్కువగా ఆ సినిమా వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. ఆ విధంగా సైరాకు నార్త్ లో చాలా వరకు థియేటర్లు మెల్లగా తగ్గుతూ వచ్చాయని, దానితో ఆ ప్రభావం కలెక్షన్ల మీద పడి ప్రస్తుతం మరింత తక్కువ స్థాయిలో సైరా కు కలెక్షన్లు వస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం అక్కడ పేలవ ప్రదర్శన చేస్తున్న సైరా సినిమా, అక్కడి బయ్యర్లు కు కొంతవరకు నష్టాలు మిగిల్చబోతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ సినిమా ఎంతమేర నష్టాలను మిగులుస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే అంటున్నారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: