"కౌన్ బనేగా కరోర్ పతి" ఈ కార్యక్రమం గురించి భాతదేశంలో అందరికి తెలిసిందే. ఎందుకంటే ఏమి లేని వారు కూడా ఇందులో తమ తెలివితేటలతో ఒక పదిహేను ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి రాత్రికి రాత్రే కోటీశ్వరులని చేసే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో ఇటీవల ఒక వ్యక్తి పాల్గొన్నాడు. అతని పేరు
కుమార్ రంజన్, ఈయన కేబీసీ షోలో పాల్గొనేందుకు బిహార్ నుంచి వచ్చాడు. ఇలాంటి షోలో
అమితాబ్ వారి లైఫ్ స్టోరీస్ అడిగి తెలుసుకుంటూ ఉంటారు.
అలాగే కుమార్ ని కూడా అడిగాడు బిగ్ బి. ఈ షోలో గెలుచుకునే డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావ్ అని కుమార్‌ను బిగ్ బి ప్రశ్నించారు. ఇందుకు
కుమార్ ఇచ్చిన సమాధానం విని
అమితాబ్ ఒకింత షాకయ్యారు. వచ్చిన డబ్బుతో నా భార్యకు మంగళ సూత్రం కొనివ్వాలని అనుకుంటున్నానని
కుమార్ తెలిపాడు. దానితో అతని మొత్తం స్టోరీ గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు అమితాబ్.
కుమార్ తన కథను వివరిస్తూ, నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే నా క్లాస్‌మెట్ ను చూసి ఇష్టపడ్డాను, మేమిద్దరం ఒకే ట్యూషన్‌కు కూడా వెళ్లేవాళ్లం. తను ఒక్క రోజు ట్యూషన్‌కి, స్కూల్ కి రాకపోయినా నాకు ప్రాణం పోయినట్లు అనిపించేది అని తెలియ చేసాడు కుమార్. ఇదంతా విని
అమితాబ్ పగలబడి నవ్వేశారు.
ఆ తర్వాత ఈ షోకి ఎందుకు వచ్చాడో వివరిస్తూ ‘నా బేబీ(భార్య)కు మెడలో మంగళ సూత్రం కూడా లేదు సర్ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నేను చేసే ఉద్యోగంతో తనకు మంగళ సూత్రం కొనడం చాలా కష్టం. అందుకే ఈ షోలో పాల్గొని వచ్చిన డబ్బుతో తన మెడలో మంగళ సూత్రం వేయాలని అనుకుంటున్నాను అని
కుమార్ అన్నాడు.
ఇది విన్న తర్వాత అమితాబ్ తో పాటు అక్కడున్న వారు కూడా షాకయ్యారు. అతను కోరుకున్నంత డబ్బు గెలుచుకోవాలని
అమితాబ్ కూడా విష్ చేశారు.
ఇటీవల అనారోగ్యంతో ముంబై లోని లీలావతి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు అమితాబ్. రెగ్యులర్ చెకప్ అంటూనే మూడు రోజుల పాటు ఆయనకి చికిత్స చేశారు హాస్పిటల్ వర్గాలు. డిశ్చార్జ్ అయిన మరుసటి రోజే
అమితాబ్ కేబీసీ షూటింగ్‌కు సరాసరి వెళ్లిపోయారు. హాస్పటిల్ నుంచి వచ్చాక తాను ఐదు కిలోలు తగ్గిపోయానని కూడా
అమితాబ్ ఈ ముఖంగా తెలిపారు.