రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి ఈమధ్య పూణే నుండి హైదరాబాద్ కు మకాం మార్చడమే కాకుండా బుల్లితెర షోలలో బిజీగా కాలం గడుపుతోంది. రైతులు సమస్య పై ఒక మూవీ తీయాలని ప్రయత్నాలు చేస్తున్న రేణు దేశాయ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కూతురు ఆద్య గురించి ఒక ఆసక్తికర విషయం వివరించింది. 

రామ్ చరణ్ పవన్ పిల్లలతో అదే విధంగా తన కజిన్స్ అందరితోను చాల సన్నిహితంగా ఉండటమే కాకుండా పండుగలకు వారందరినీ తన ఇంటికి పిలిచి వారందరితోను పండుగను ఎంజాయ్ చేయడమే కాకుండా వారందరికీ పండగ సందర్భంగా గిఫ్ట్స్ ఇచ్చే అలవాటు ఉందట. అయితే ఈ గిఫ్ట్ ఇచ్చేముందు చరణ్ తన కజిన్స్ అందరికీ ఒక కండిషన్ పెడతాడట. 

జీవితంలో వాళ్ళు ఏ రంగంలో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అన్న విషయం గురించి ఒక చిన్న స్లిప్ పై రాయమని చెపుతాడట. ఈ అలవాటు ప్రకారం ఈమధ్య వచ్చిన ఒక పండుగ రోజున చరణ్ ఇంటికి వచ్చిన ఆద్య చరణ్ ను ఒక వింత కోరిక కోరినట్లు తెలుస్తోంది. తాను పెద్ద అయ్యాక దర్శకురాలిగా మారాలని ఉందనీ చెపుతూ ఏకంగా చరణ్ తో ఒక భారీ సినిమాను తీయాలని తన కోరిక అంటూ చరణ్ కు చెప్పి షాక్ ఇచ్చిందట. 

తన చెల్లెలు ఆద్య కోరిక విని చరణ్ నవ్వుతూ ఆమె పెద్ద అయ్యాక తన డేట్స్ తప్పకుండ ఆద్యకు ఇస్తాను అంటూ ప్రామిస్ చేసాడనీ రేణు దేశాయ్ ముచ్చట పడుతూ తన కూతురు ప్రతిభ గురించి పొంగి పోయింది. ఇప్పటికే శాస్త్రీయ నృత్యం బాగా నేర్చుకుంటున్న ఆద్య రానున్న రోజులలో మహిళా దర్శకురాలిగా సెటిల్ అయ్యే ఆస్కారం కనిపిస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: