ప్రముఖ తమిళ నటుడు దళపతి విజయ్‌ ఇంటి చుట్టూ చెన్నై పోలీసులు భారీగా పోలీసులను నియమించడం జరిగింది. తాజాగా  చెన్నై కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ వచ్చింది. విజయ్ ఇంట్లో బాంబ్ పెట్టామని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. అది ఏ క్షణానైనా పేలా వచ్చు అని బెదిరించాడు. దీనితో  పోలీసులు హుటాహుటిన విజయ్ ఇంటికి చేరుకోవడం జరిగింది. చెన్నైలోని పనైయూర్ ప్రాంతంలో విజయ్ నివాసం ఉంటున్నాడు. వెంటనే పోలీసులు విజయ్ నివాసానికి   చేరుకుని ఇల్లంతా తనిఖీలు చేశారు. అయితే బాంబ్ మాత్రం దొరకలేదు. ఎందుకైనా మంచిదని ఆయన ఇంటి చుట్టూ భారీగా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.


అనంతరం విజయ్ తండ్రి ప్రముఖ నిర్మాత చంద్రశేఖర్ నివాసానికి కూడా పోలీసులు పోవడం జరిగింది. అక్కడ కూడా తనిఖీలు చేశారు. అక్కడా బాంబ్ లభించలేదు. ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అళపాక్కమ్ ప్రాంతంలోని పోరూర్ సమీపం నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. ఫోన్ చేసిన కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇలా ఎందుకు చేశావ్ అని పోలీసులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పి పోలీసులను అయోమయానికి గురి చేసాడు ఆ కుర్రాడు. 
ఇటీవల  విజయ్ నటించిన ‘బిజిల్’ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్నాడు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘విజిల్’ టైటిల్‌తో విడుదల అయంది. నయనతార ఇందులో విజయ్‌ సరసన నటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు ఈ సినిమాకి.

ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సమాచారం ఉంది. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన ‘చక్ దే ఇండియా’ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు అట్లీ తెలియచేయడం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: