టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతేడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో తన సినీరంగ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అయితే అప్పట్లో ఆ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి పవన్ ఫ్యాన్స్ ని ఎంతో నిరాశకు గురిచేసింది. ఇక ఆ తర్వాత నుండి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమైన పవన్, ఇటీవల తన జనసేన పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలో నిలవడం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఆయన ఘోర పరాజయం పొందారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని పవన్, ఇక పై తన పార్టీని మరింతగా అభివృద్ధి పరిచి ప్రజలకు చేరువ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. 

అయితే ఓవైపు ఆయన ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ గారు తమ కోసం ఒక మంచి సినిమాలో నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో ఆశ పడుతున్నారు. ఇక ఎట్టకేలకు ఫ్యాన్స్ నిర్ణయానికి తలవంచిన పవన్, ఇటీవల బాలీవుడ్లో రిలీజ్ అయి మంచి సక్సెస్ ను అందుకున్న పింక్ అనే సినిమా రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోని కపూర్ మరియు టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా కు యువదర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనుండగా, ఈ సినిమా ప్రారంభోత్సవం అతి త్వరలో జరగనున్న ట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రస్తుతం మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు, 

అలానే త్వరలో బన్నీ సరసన సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా నటించనున్న రష్మిక మందన్న ఎంపికయినట్లు పలు టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమా విషయమై నిన్ననే నిర్మాత దిల్ రాజు, రష్మికకు కథ వివరించడం జరిగిందని, అలానే ఆమె కూడా నటించడానికి ఒప్పుకుందని సమాచారం. అయితే ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. మరి ఒకవేళ ఇదే గనుక నిజమైతే రష్మిక పంట పండినట్లే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: