‘ఎఫ్ 2’ సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్న
వెంకటేష్ ‘వెంకీ మామ’ తో కూడ అదే సక్సస్ రిపీట్ అవుతుందని భావిస్తున్నాడు. ఈ
మూవీ రిజల్ట్ ఇంకా తెలియకుండానే
వెంకటేష్ లేటెస్ట్ గా మనసు పడ్డ ఒక
తమిళ సినిమా హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో సూపర్ హిట్టయిన
ధనుష్ సినిమా ‘అసురన్’ ను
వెంకీ హీరోగా
రీమేక్ చేయబోతున్నట్లు
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ధనుష్ లాంటి యంగ్
హీరో చేసిన సినిమాకు
వెంకటేష్ ఎలా న్యాయం చేయగలడు అన్న సందేహాలు ఒక ఎత్తు అయితే ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాయా అన్న సందేహాలు మరికొన్ని చోట్ల వినిపిస్తున్నాయి. తమిళంలో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న
వెట్రిమారన్ లా ఈ సినిమాను తెలుగులో ఎవరు
రీమేక్ చేయగలడు అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితులలో ఈ
మూవీ దర్శకుడుగా ‘రాజు గారి గది’ ఫేమ్ ఓంకార్ పేరు బయటకు రావడం చాల మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ‘రాజుగారి గది’ హిట్ అయినప్పటికీ ఆ తరువాత అతడు తీసిన ‘జీనియస్’ ‘రాజుగారి గది’ 2-3 ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు
ఓంకార్ వంక చూసే నిర్మాతలు కరువైపోయారు.
అయితే
నిర్మాత సురేశ్ బాబు అడిగాడా లేకుంటే
ఓంకార్ తనకు తానుగా ముందుకు వచ్చాడా తెలియకపోయినా ‘ఆశురన్’
రీమేక్ బాధ్యతలను
ఓంకార్ కు అప్పచెపుతారు అని వస్తున్న వార్తలు చాలామందికి షాక్ ఇస్తున్నాయి.
రీమేక్ సినిమాల హీరోగా మంచి సక్సస్ రేటు
వెంకటేష్ కు ఉన్నప్పటికీ ‘ఆశురన్’ విషయంలో
వెంకీ తప్పటడుగులు వేస్తున్నాడు అంటూ కొందరు
ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘అసురన్’ లాంటి క్లాసిక్‌ను
ఓంకార్ చేతిలో పెట్టడం ఏమాత్రం
వెంకటేష్ కెరియర్ కు మంచిది కాదు అని కొంతమంది సలహాలు ఇస్తున్నట్లు టాక్..