కన్నడ నటుడు యాష్ హీరోగా
శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించి, గత ఏడాది
డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన
సినిమా కెజిఎఫ్. కన్నడలో అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమాను, అప్పట్లో దర్శకధీరుడు
రాజమౌళి సూచన మేరకు, తెలుగు సహా మిగతా ఇతర ప్రధాన భారతీయ భాషల్లో కూడా రిలీజ్ చేసింది
సినిమా యూనిట్. అప్పట్లో దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురిసాయి.
యువ దర్శకుడు
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వచ్చిన ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.
ఇక
సినిమా విడుదల సమయంలోనే దీనికి రెండవ పార్ట్ తీస్తున్నట్లు ప్రకటించిన
సినిమా యూనిట్, ప్రస్తుతం ఆ భాగం చిత్రీకరణలో పూర్తిగా నిమగ్నం అయింది. అయితే ఇటీవల కొన్ని అనుకోని కారణాల వలన ఈ
సినిమా షూటింగ్ కొంత వాయిదా పడడంతో, ఇకపై ఏ మాత్రం జాప్యం చేయకూడదని భావించి, ప్రస్తుతం షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్నారట. ఇకపోతే నేడు
కెజిఎఫ్ చాప్టర్ 2కి సంబంధించి దర్శకుడు
ప్రశాంత్ నీల్, సినిమాలో ఎంతో కీలకమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బిట్ ని తన సోషల్
మీడియా మాధ్యమాల్లో ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేసారు.
సంగీత దర్శకుడు బర్సుర్
రవి స్వరపరిచిన ఈ మ్యూజిక్ బిట్ ని చాప్టర్ 2లో మీ
ప్రశాంత్ నీల్, సినిమాలోని ఏ సీన్ దగ్గర వినియోగిస్తారో కొద్దిరోజుల్లో మీకే తెలుస్తుంది అంటూ కొంత సరదాగా పోస్ట్ చేసారు.
ఇక ఆయన రిలీజ్ చేసిన ఆ సెన్సేషనల్ మ్యూజిక్ బిట్, ప్రస్తుతం పలు సోషల్
మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే కొందరు ఈ
సినిమా ఫ్యాన్స్ మాత్రం, ఇది వింటుంటే తప్పకుండా చాప్టర్ 2 ఫస్ట్ లుక్ టీజర్ కు ఈ మ్యూజిక్ ని వాడే అవకాశం కనపడుతోందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ సోషల్
మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పరుచుకున్న ఈ
సినిమా, వచ్చే ఏడాది సమ్మర్ లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.....!!