టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తొలుత అసిస్టెంట్
డైరెక్టర్ గా జీవితాన్ని మొదలెట్టిన
రామ్ గోపాల్ వర్మ, ఆ తరువాత దర్శకుడిగా మారి పలువురు
టాలీవుడ్ టాప్ స్టార్స్ తో సినిమాలు తీసి మంచి హిట్స్ అందుకున్నారు. అనంతరం బాలీవుడ్ కి చేరిన వర్మ, అక్కడ కూడా
అమితాబ్ వంటి బడా స్టార్స్ తో సినిమాలు తీసి శభాష్ అనిపించుకున్నారు. అయితే మొదటి నుండి ఏ విషయం పైనైనా తన మనసుకు నచ్చిన విధంగా, సూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వర్మ,
టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
అయితే కొన్నాళ్లుగా తెలుగులో ఆయన తీస్తున్న వివాదాస్పద సినిమాలతో వరుస పరాజయాలు అందుకుంటున్నారు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా వర్మ మాత్రం ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న తాజా
సినిమా 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' తాలూకు ట్రైలర్ ఇప్పటికే
యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి వ్యూస్ ని సాధించి, సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇకపోతే ఈ సినిమాతో చంద్రబాబు,
జగన్,
పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన వర్మ, సినిమాలో తాము ఎవరిని ప్రత్యేకించి కించపరచేలేదని, రేపు
సినిమా రిలీజ్ తరువాత ఆ విషయం మీకు తెలుస్తుందని కొద్దిరోజులుగా చెప్తున్నారు.
అయితే బాబు ప్రభుత్వం మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడాన్ని గట్టిగా టార్గెట్ చేసారు వర్మ. ఈ సినిమాలో ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలతో పాటు ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన
జగన్ మరియు
జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ కు సంబందించిన సీన్స్ చాలా కీలకంగా ఉన్నట్లు ఇటీవల రిలీజ్ అయిన ఈ
సినిమా ట్రైలర్ ని బట్టి మనకు అర్ధం అవుతుంది. ఇక ప్రస్తుతం తన కోసం వర్మ
హైదరాబాద్ లో ఒక కొత్త ఆఫీస్ ని నిర్మించుకున్నారు. దాని ముందు భాగాన
సైకిల్ చైన్ మరియు గన్ బొమ్మలు ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సైకిల్ చైన్, గన్ మధ్యన ఉన్న విండోనే నా డెన్ అంటూ ఆయన తన
ట్విట్టర్ లో దాని ఫోటోని పోస్ట్ చేసారు. అయితే ఆ ఫోటోని చూసిన పలువురు నెటిజన్లు ఎంతైనా వర్మ అంటే వర్మే అంటూ తమ సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!