టాలీవుడ్‌లో గత కొంత కాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన రేంజ్ హిట్
సినిమా కోసం ఫీట్లు చేస్తోన్న యంగ్
హీరో సందీప్‌కిషన్ ఈ రోజు తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హిట్ కొట్టిన
సందీప్ ఆ తర్వాత ఆ రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోయాడు. తాజాగా ఈ రోజు తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కామెడీ సినిమా స్పెషలిస్ట్ అయిన జి.నాగేశ్వర్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హన్సిక మెత్వాని హీరోయిన్.
కోలీవుడ్ క్రేజీ
హీరోయిన్ వరలక్ష్మి శరత్
కుమార్ మరో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఏపీలో పలు కేంద్రాల్లో ఈ
సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ
సినిమా చూసిన వారు ట్వీట్టర్ ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి రామకృష్ణ సినిమాలో
కామెడీ అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయని అంటున్నారు. ఓ వర్గం వారు మెప్పించే
కామెడీ సీన్లతో పాటు చాలా బోరింగ్ సీన్లు కూడా ఉన్నాయంటున్నారు.
ఇటీవల
ఏపీ రాజకీయాల్లో హైలెట్గా నిలిచిన పలు అంశాలను బేస్ చేసుకుని దర్శకుడు రాసుకున్న
కామెడీ సైటర్లు బాగా పేలాయంటున్నారు. కేఏ.పాల్ హంగామాతో పాటు కోడి కత్తి, గ్రామ వలంటీర్లను బేస్ చేసుకుని రాసుకున్న సీన్లు హైలెట్ అట. ఇక
హీరో సందీప్ కిషన్ అద్భుతమైన
కామెడీ టైమింగ్‌తో మెప్పించాడట.
వెన్నెల కిషోర్, రఘుబాబు, సప్తగిరి కమెడియన్స్ అల్లరి సినిమాలో బాగా వర్కవుట్ అయ్యిందట.
అయితే బోరింగ్ సీన్లు, రన్ టైం మైనస్‌గా చెపుతున్నారు. ఇక వరలక్ష్మి శరత్
కుమార్ నటన మరో హైలెట్. చివర్లో దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇక సినిమాకు పర్వాలేదన్న టాక్ వస్తోంది. మరి పూర్తి రివ్యూలతో ఈ
సినిమా సత్తా ఏంటో తేలిపోనుంది.