నాని లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ ఫెయిల్ కావడంతో ఇప్పుడు అతడి ఆశలు అన్నీ అతడి 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ మూవీ ‘వి’ పై ఉన్నాయి. ఈ మూవీలో నాని నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. 

ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాది పండుగ రోజున విడుదల చేయడానికి పక్కా ప్లాన్ మీద ఉన్నారు. ఈ మూవీని సోలో రిలీజ్ గా విడుదల చేసి సమ్మర్ రేస్ ను ప్రారంభించాలి అని ఊహిస్తున్న నాని ఆలోచనలకు నాగచైతన్య చెక్ పెడుతున్నట్లు సమాచారం. 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవిలు నటిస్తున్న మూవీని కూడ వచ్చే ఏడాది సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ ఉగాది పండుగ రోజున విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల ‘ఫిదా’ తరువాత తీస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. 

దీనికితోడు సాయి పల్లవి నాగచైతన్యల కాంబినేషన్ ఈ మూవీకి మరొక ప్లస్ పాయింట్. ఇప్పుడు ఇలా రాబోతున్న ఉగాది చైతన్య నానీల వార్ గా మారడంతో మళ్ళీ నానీకి షాక్ తప్పదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం ‘జెర్సీ’ ఉత్తమ చిత్రంగా పేరు తెచ్చుకున్నా బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయాన్ని అందుకోలేక పోయింది. దానికంటే ముందు వచ్చిన ‘మజిలీ’ లో క్రికెట్‌ నేపథ్యం ఉండడం అది పూర్తిస్థాయి కమర్షియల్‌ సినిమా కావడంతో దాని ఎఫెక్ట్‌ ‘జెర్సీ’ పై పడింది అన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. దీనితో నానీ ‘జెర్సీ’ కి ఊహించిన స్థాయిలో కలక్షన్స్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి నానీ ‘వి’ కి నాగచైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ వల్ల ఏర్పడుతుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: