విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని నాగచైతన్యల కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా వెంకీ మామ. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ సినిమాలు తీసిన యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మరియు నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు సాంగ్స్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను వాస్తవానికి జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని తొలుత భావించారు. 

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దానికి రెండు కారణాలు ఉన్నాయట. అయితే మొదట డిసెంబర్ లో రిలీజ్ చేద్దాం అని యూనిట్ భావించినప్పటికీ, అప్పటికే సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే, బాలకృష్ణ రూలర్ సినిమాలు బెర్తులు ఖాయం చేసుకోవడంతో కొంత వెనక్కు తగ్గిందట వెంకీ మామ యూనిట్. ఇటువంటి పరిస్థితుల్లో పోనీ డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేద్దామా అంటే సినిమా ఇంకా పూర్తి కాలేదని, 

ఇక సంక్రాంతి బరిలో మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అలవైకుంఠపురములో, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా, రజినీకాంత్ దర్బార్ సినిమాల మధ్య పోటీ ఉండడంతో, అటువంటి పోటీ వాతావరణంలో తమ సినిమాను రిలీజ్ చేయడం ఇష్టం లేక ఫైనల్ గా సినిమాను ఫిబ్రవరి మొదటి వారానికి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారట. ఇక ఈ విషయమై మరొక రెండురోజుల్లో అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు టాక్. మరి ఈ వార్తలో ఎంతరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మరొక రెండు రోజులు ఓపిక పట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: