ఎంత గ్లామర్ ఉన్నా.. ఆవగింజంత అధృష్టం కూడా ఉంటాలంటారు. డెబ్యూ మూవీ హిట్ తో పంజాబీ ముద్దుగుమ్మ అందరి కళ్లలో పడింది. ఛాన్సులు వాటంతట అవే వచ్చాయి. ఇదంతా బాగానే ఉన్నా.. సక్సెస్ మాత్రం దక్కడం లేదు. తనకున్న గ్లామర్ ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో.. సీనియర్ హీరోను నమ్ముకుంది. అదృష్టాన్ని ప్రతిపాదిస్తాడన్న నమ్మకంతో ఉన్న ఆ గ్లామర్ డాల్ ఉంది. 


ఆర్ ఎక్స్ 100 రిలీజ్ తర్వాత పాయల్ పేరు తెలుగులో మారుమోగిపోతోంది. ఇంకేముందీ స్టార్ హీరోయిన్ అయిపోయిందనుకుంటే.. ఫ్లాపులు చుట్టుముట్టాయి. కెరీర్ బిగినింగ్ లోనే.. సీత సినిమాలో ఐటం సాంగ్ చేసేసి.. క్రేజ్ పోగొట్టుకుంది. తన చుట్టూ తిరిగే కథ కావడంతో.. ఒప్పుకున్న చిత్రం ఆర్డిఎక్స్ లవ్ నిరాశనే మిగిల్చింది. 


ఎన్ని ఫ్లాపులొచ్చినా.. గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్ కు సీనియర్స్ కరుణించి ఆఫర్స్ ఇచ్చారు. వెంకీమామలో వెంకటేశ్ పక్కన.. డిస్కో రాజాలో రవితేజతో జత కడుతోంది. ముందుగా డిసెంబర్ 13న రిలీజ్ అవుతున్న వెంకీమామపై చాలా ఆశలు పెట్టుకుంది పాయల్. ఎందుకంటే ఆ మధ్య కంటిన్యూస్ ఫ్లాపుల్లో ఉన్న తమన్నాకు ఎఫ్ 2తో హిట్ ఇచ్చాడు వెంకీ. 


సీనియర్ హీరో వెంకటేశ్ మల్టీ స్టారర్ మూవీస్ తో ఇరగదీస్తున్నారు. సింగిల్ గా కాకుండా మరో హీరోతో కలిసి చేస్తున్న సినిమాలు ఆయన కెరీర్ ను విజయపథంలో నడిపిస్తున్నాయి. వెంకటేశ్ నవరసాలు పండించడంలో దిట్ట. సీరియస్ సీన్స్ లో సీరియస్, సీరియస్ లో కామెడీ, ఫైటింగ్స్, డైలాగ్స్ ఇలా ఒకటేమిటి అన్ని విధాలా యాక్టింగ్ చేయనున్న వెంకీ అంటే ఫ్యాన్స్ పడిచస్తారు. మరి ఆ హీరో పాయల్ ను ఎలా పైకి తీసుకొస్తారో చూడాలి.  


బాహుబలి తర్వాత తమన్నా ఎన్ని సినమాలు చేసినా ఫ్లాపులే. ఎఫ్ 2తో తమన్నా ఫామ్ లోకి వచ్చింది. అలాగే వెంకీమామతో సక్సెస్ వస్తుందన్న ఆశతో ఉంది పాయల్ రాజ్ పుత్. రీసెంట్ గా రిలీజైన సాంగ్ పాపులర్ కావడంతో.. ఈ ప్రాజెక్ట్ పై నమ్మకం మరింత పెరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: