వెబ్ సిరీస్ ‘ఔట్ ఆఫ్ లవ్’. అక్రమ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ దీనిని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తిగ్మాంషు ధులియా   డైరెక్ట్  చేసాడు ఈ సినిమా గురించి  న విశేషాలు ధులియా మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. పరాయి  ఈ కాలం లో వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏమాత్రం తప్పు కాదని అంటున్నారు..

 


పరాయి వ్యక్తులతో సెక్స్ అస్సలు తప్పు కాదని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు తిగ్మాంషు ధులియా. అయన చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో  తీవ్ర  దుమారం రేపుతున్నాయి.‘అక్రమ సంబంధాలు ఈరోజుల్లో కామనే. ఇది మానవ సహజం. కానీ కొందరు వ్యక్తులు కట్టుకున్న తమ భాగస్వామిని   మోసం చేయలేక లేక పోతే సమాజానికి బయపడి లేదా ఇంకా ఎదో కారణాల వాళ్ళ  పరాయి వారితో సంబంధాలు పెట్టుకోరు. 

 


మరికొందరు ఈ విషయంలో చాలా వీక్‌గా ఉంటారు. అందుకే కట్టుకున్న భార్యను, భర్తను మోసం చేసి పరాయి వ్యక్తులతో శారీరిక సంబంధం పెట్టుకుంటారు  నేను ‘ఔట్ ఆఫ్ లవ్’ వెబ్ సిరీస్‌ను ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాను. నేను ఇప్పటివరకు చదివిన స్క్రిప్ట్స్‌లో ఇది చాలా బెస్ట్ అని నా అభిప్రాయం. నేను స్క్రిప్ట్ అంతా చదివాను కాబట్టి ఈ వెబ్ సిరీస్‌ను నేనొక్కడినే డైరెక్ట్ చేశాను. 

 


ప్రేమ, అబద్ధాలు, అక్రమ సంబంధాల నేపథ్యంలోనే  పూర్తిగా ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఇందులో రసికా దుగ్గల్, పురబ్ కోహ్లీ, సోనీ రాజ్దాన్, హర్ష్ ఛాయా కీలక పాత్రల్లో నటించారు. వీరంతా చాలా సహజంగా నటించారు. భవిష్యత్తు అంతా వెబ్ సిరీస్‌పైనే ఆధారపడి ఉంది. ఆసక్తికరమైన కంటెంట్‌తో ఇండియా  లో ఎన్నో వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది’ అని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: