జబర్దస్త్ కొన్నేళ్లుగా టీవీ రేటింగుల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈటీవీ ప్రభ తగ్గిపోతున్న రోజుల్లో మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ ఆధ్వర్యంలో వచ్చిన జబర్దస్ వస్తూ వస్తూనే పెద్ద హిట్ అయ్యింది. దీని సక్సస్ చూసి ఆ తరహాలో పలు షోలు రూపొందించినా అవేమీ పెద్దగా ఆకట్టుకోలేదు. రోజా, నాగబాబు జడ్జిమెంట్స్.. కంటెస్టెంట్ల మధ్య అటాచ్ మెంట్ ఓ బ్రాండ్ ను రూపొందించాయి. జబర్దస్త్ నుంచి చాలా మంది కమెడియన్లు పుట్టుకొచ్చారు. కొందరు ఏకంగా హీరోలు కూడా అయ్యారు. షకలక శంకర్, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర వంటి వారు ఏకంగా హీరోలుగా సినిమాలు తీశారు కూడా.

 

ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన నాగబాబు... అందుకు కారణాలు వివరించారు. దాదాపు ఏడేళ్ల పాటు ఆయన ఈ ప్రముఖ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ వస్తున్తనారు. ఆయన బయటకు రావడంపై అనేక పుకార్లు వినిపించాయి. వాటికి పుల్ స్టాప్ పెట్టేందుకు ఆయనే ముందుకు వచ్చారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరణ ఇచ్చారు. మల్లెమాల శ్యాంప్రసాద్‌గారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు.

 

కేవలం అవి ఆలోచనాపరమైన విభేదాలు అనవచ్చు. ముఖ్యంగా అవి వ్యాపారానికి సంబంధించినవి. శ్యాంప్రసాద్‌రెడ్డిగారికి, ఈటీవీ వారికి కృతజ్ఞతలు.. అని తెలిపారు నాగబాబు. అయితే అక్కడితో ఆగకుండా.. తాను జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చాననే విషయాన్ని వరుసగా తన యూ ట్యూబ్ ఛానళ్లో వివరిస్తాన్నారు.

 

అంటే ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. మరి నాగబాబు ఎలాంటి బాంబులు పేలుస్తారో చూడాలి. జబర్దస్త్ గురించి నాగబాబు ఇంకా ఏమన్నారంటే..” జబర్దస్త్‌ ఒక సుదీర్ఘ ప్రయాణం. 2013 నుంచి 2019 ఈ రోజు వరకూ నా ప్రయాణం కొనసాగింది. ఇది నాకు హ్యాపీ, ఎమోషనల్ జర్నీ.. అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: