అక్కినేని యువ హీరో నాగ చైతన్య ఈ ఇయర్ మజిలీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న చైతుకి ఈ సినిమా హిట్ మంచి జోష్ ఇచ్చింది. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, సమంత హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో చైతు, సమంతలు రీల్ లైఫ్ భార్యాభర్తలుగా కూడా మెప్పించారు.
తనని ఆడియెన్స్ ను ఎలా చూడాలని అనుకుంటున్నారో మజిలీ హిట్ తో బాగా అర్ధమైంది. అందుకే చైతు ఇక అదే విధమైన కథలతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ పరిశీళణలో ఉంది. ఈ మూవీలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.
అక్కినేని ఫ్యామిలీ హీరోగా మొదట్లో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన నాగ చైతన్య అలా ప్రయత్నించిన సినిమాలు ఫలితాలు తేడా కొట్టడంతో ఇక అలాంటి సినిమాలు చేయడం మానేసి ప్రేమ కథలు చేస్తూ వచ్చాడు. మజిలీ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించి చైతులోని నటుడిని బయటకు వచ్చేలా చేసింది. అందుకే ఇక మీదట కూడా ఇదే తరహా కథలను చేయాలని ఫిక్స్ అయ్యాడు నాగ చైతన్య. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ త్వరలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా నుండి వచ్చిన చైతు ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను అలరించింది.
ఫిదాతో మళ్లీ సూపర్ ఫాంలోకి వచ్చిన శేఖర్ కమ్ముల ఈసారి మళ్లీ ఓ క్రేజీ లవ్ స్టోతో ఈ సినిమా చేస్తున్నాడు. వరుణ్ తేజ్, సాయి పల్లవిలు ఫిదాతో చేసిన మ్యాజిక్ ను మళ్లీ నాగ చైతన్య, సాయి పల్లవితో మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈ మూవీలో చైతు రోల్ అందరికి సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది. మజిలీ తో కెరియర్ లో బెస్ట్ హిట్ అందుకున్న నాగ చైతన్య ఇక మీదట కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు.