దర్శకుడు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి హీరోయిన్స్ ను ఎంపిక చేసే విషయంలో పడినంత టెన్షన్ తన గత సినిమాల విషయంలో ఎప్పుడు పడలేదు. ముఖ్యంగా ‘ఆర్ ఆర్ ఆర్’ లో జూనియర్ పాత్రకు హీరోయిన్ గా ఐరిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ ఎంపిక చేసే విషయంలో ‘సాహో’ సైరా’ మూవీల ఫలితాలు పరోక్షంగా రాజమౌళిని ప్రభావితం చేసాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

‘సాహో’ ‘సైరా’ మూవీలకు విపరీతమైన బడ్జెట్ పెరిగి పోవడంతో ఆ మూవీలకు వందల కొట్లలో కలక్షన్స్ వచ్చినా ఆ మూవీ బయ్యర్లకు తీవ్ర నష్టాలు వచ్చాయి. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ బడ్జెట్ విషయంలో రాజమౌళి ఎలర్ట్ అయి సుమారు 100 కోట్ల వరకు ఈ మూవీ బడ్జెట్ లో కోతలు విధించినట్లు వార్తలు వచ్చాయి.

ఆ పొదుపు చర్యల భాగంగానే ఈ మూవీలో హీరోయిన్ గా ఒలీవియా ఎంపిక అయింది అని అంటున్నారు. ఈమె డిమాండ్ చేసిన పారితోషికం రాజమౌళి ఇష్టపడ్డ ఎమ్మా రాబర్డ్స్ పారితోషికంతో పోల్చుకుంటే చాల తక్కువగా ఉండటంతో జక్కన్న ఎమ్మా రాబర్డ్స్ ను పక్కకు పెట్టి ఒలీవియాను ఎంపిక చేసినట్లు టాక్. అయితే పెద్దగా పాపులర్ కాని ఒక బ్రిటీష్ టివి నటిని జూనియర్ పక్కన ఎంపిక చేసి చరణ్ పక్కన భారీ పారితోషికం ఇచ్చి అలియా భట్ ను ఎంపిక చేయడం జూనియర్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో ఒలీవియా పాత్ర కేవలం 20 నిముషాలు మాత్రమే ఉంటుందనీ జూనియర్ పోషిస్తున్న కొమరమ్ భీమ్ పాత్రను ఆరాధించే బ్రిటీష్ రాజకుమారిగా ఈమె కనిపిస్తుంది తప్ప ఈమెకు జూనియర్ కు మధ్య పెద్దగా ఇంటిమేట్ సీన్స్ ఉండవు అని అంటున్నారు. దీనితో రోమాన్స్ విషయంలో కూడ తమ హీరోకు రాజమౌళి అన్యాయం చేసారా అంటూ జూనియర్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: