దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన ఇలియానా తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. దేవదాస్ సినిమా తరువాత ఇలియానా నటించిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. పోకిరి ఇండస్ట్రీ హిట్ కావటంతో ఇలియానాకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది. స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీయార్, అల్లు అర్జున్ లకు జోడీగా ఇలియానా నటించింది.
2012 సంవత్సరంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో దేవుడు చేసిన మనుషులు సినిమాలో రవితేజకు జోడీగా నటించిన ఇలియానా ఆ సినిమా తరువాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావటంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లింది. కానీ బాలీవుడ్ లో ఇలియానా అడపా దడపా సినిమాలు మాత్రమే చేసింది. ఇలియానా బాలీవుడ్ లో నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. అదే సమయంలో విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ఇలియానా ప్రేమలో పడింది.
ఆ తరువాత బాలీవుడ్ లో ఇలియానాకు అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్ వైపు అవకాశం కోసం ఎదురు చూసిన ఇలియానాకు అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కూడా డిజాస్టర్ అయింది. నటించిన సినిమాలు ఫ్లాప్ కావడం, అవకాశాలు తగ్గటంతో ఇలియానా కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని సమాచారం. ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్లిన సమయంలో తరచూ నిద్ర మాత్రలు వేసుకునేదని తెలుస్తోంది.
డిప్రెషన్ లోకి వెళ్లిన సమయంలో ఇలియానా ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందట. కానీ కెరీర్ లో రాణించాలనే ఉద్దేశంతో బరువు తగ్గి ఇలియానా మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇలియానా నటించిన పాగల్ పంతి చిత్రం శుక్రవారం రోజున విడుదలైంది. ఈ సినిమాకు బాలీవుడ్ లో హిట్ టాక్ రాలేదు. ప్రస్తుతం ఇలియానా ఒక హిందీ సినిమాలో నటిస్తోంది.