‘బిగ్ బాస్ ౩’ షోతో రాహుల్ పునర్నవి భూపాలం పేర్లు అందరికి సుపరిచితమైన పేర్లుగా మారిపోయాయి. ‘బిగ్ బాస్’ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన వీరిద్దరి కెమెస్ట్రీ ఈ షోను చూసే వారిని విపరీతంగా ఆకర్షించింది. ఈ షో పూర్తి అయి వీరిద్దరూ బయటకు వచ్చాక కూడా ఈ జంటపై క్రేజ్ కొనసాగుతూనే ఉంది. ‘బిగ్ బాస్’ హౌస్ లో వీరిద్దరి లవ్ కెమెస్ట్రీకి ముచ్చట పడ్డ బుల్లితెర ప్రేక్షకులు ఇప్పటికీ వీరిద్దరికీ అభిమానులుగా కొనసాగుతున్నారు.
వీరిద్దరూ తమ మధ్య ఎటువంటి సాన్నిహిత్యం లేదనీ కేవలం తాము మంచి మిత్రులు మాత్రమే అంటూ అనేక సార్లు ఓపెన్ గా చెపుతున్నా వీరిద్దరి మధ్య ఉన్న రహస్య సంబంధం గురించి అనేక సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వారి జంట చూడ ముచ్చటగా ఉంటుందని అభిమానులు వీరిద్దరికీ సలహాలు ఇస్తున్నారు.
ఈ నేపధ్యంలో వీరిద్దరూ కలిసి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పునర్నవి రాహుల్ తో సరదాగా అన్న కామెంట్స్ నిజం అనుకుని రాహుల్ అభిమానులు పునర్నవిని టార్గెట్ చేస్తూ విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ బిగ్ బాస్ విన్నర్ గా మారడానికి తన ప్రోత్సాహమే కారణం అంటూ ఆమె చేసిన కామెంట్స్ ను రాహుల్ అభిమానులు నెగిటివ్ గా తీసుకుని ఈమెకు ఇష్టం వచ్చినట్లుగా అశ్లీల పదాలతో మెసేజ్ లు పెడుతున్నారట.
దీనితో షాక్ అయిన రాహుల్ తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేస్తూ తనకు ఇప్పటికీ పునర్నవి ఒక మంచి స్నేహితురాలు అనీ ఇలా ఆమెను టార్గెట్ చేయవద్దు అంటూ రాహుల్ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. కేవలం రేటింగ్స్ కోసం తాము ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ ఛానల్ ఆ ప్రోమోను అలా కట్ చేశారని దాన్ని పట్టుకుని అందరూ పునర్నవి తిట్టడం సరికాదని ఆమెను టార్గెట్ చేయకండని రాహుల్ తన అభిమానులకు సూచనలు ఇస్తున్నాడు..