నాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో 'వి' సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత నాని మరోసారి నిన్నుకోరి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ 1న ఈ మూవీకి ముహుర్తం జరుగనుందని తెలుస్తుంది. రీతు వర్మ ఈ సినిమాలో నానితో రొమాన్స్ చేస్తుందని తెలుస్తుంది.
నానితో ఆల్రెడీ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించిన రీతు వర్మ మరోసారి నానికి జోడీ కడుతుంది. డైరక్టర్ శివ నిర్వాణ విషయానికి వస్తే అతని మొదటి సినిమా నానితోనే చేశాడు. హీరో ప్రేమ విఫలమైనా సరే తన ప్రేయసి దగ్గరకు వెళ్లి ఆమెతో ఆమె భర్తతో ఉండి తన ప్రేమని మర్చిపోయేకా వారి ప్రేమని చూపించి నిన్నుకోరితో హిట్ అందుకున్నాడు దర్శకుడు.
ఇక ఈ సినిమా తర్వాత మజిలీ అంటూ నాగ చైతన్య, సమంతలతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు శివ నిర్వాణ. మాములుగా అయితే మొదటి సినిమా హిట్టైనా రెండో సినిమాకు దర్శకులు తడబడుతుంటారు. కాని శివ మాత్రం మొదటి సినిమాతో పాటుగా రెండో సినిమాను అదే రేంజ్ హిట్ అందుకున్నాడు. నాగ చైతన్య కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా ఈ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమాల తర్వాత నానితో మరో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు శివ.
ఈ మూవీ కూడా లవ్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో కూడా కంపల్సరీ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. డైరక్టర్.. హీరో కాంబో సూపర్ హిట్ కాబట్టి పక్కాగా రాబోయే ఈ ప్రాజెక్ట్ కూడా హిట్టు కొడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రీతు వర్మ నటిస్తుంది. ఈ మూవీని కూడా మజిలీ నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్నారు.