టాలీవుడ్ ఆరడుగుల అందగాడు రానా ఆరడుగుల ఎత్తు నుండి ఏకంగా పదహారడుగుల ఎత్తుకు ఎదిగాడు. రానా ఆరడుగుల ఎత్తు నుండి పదహారడుగుల ఎత్తుకు ఎదగటం ఏంటి... అని ఆశ్చర్యపోతున్నారా..? రానా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఒక ఫోటో షేర్ చేశాడు. రానా షేర్ చేసిన ఫోటోలో రానా చాలా ఎత్తుగా కనిపించటం గమనార్హం. నల్ల కళ్లద్దాలు పెట్టుకొని, కౌబాయ్ క్యాప్ పెట్టుకొని రానా ఫోటోలో విచిత్రంగా కనిపించాడు. 
 
జాతరల్లో, సర్కస్ లో కొందరు ఎత్తైన కర్రలపై నిలబడి కర్రలను బ్యాలన్స్ పట్టుకొని నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఎంతో శిక్షణ తీసుకుంటే మాత్రమే కర్రలపై నిలబడటం సాధ్యమవుతుంది. రానా కూడా జాతరల్లో సాహసాలు చేసే వారిలా చిరునవ్వులు చిందిస్తూ, పొడవాటి కర్రలపై నిల్చొని ఫోటోలో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. రానా సరదా కోసం ఈ ఫోటో దిగాడా...? లేక సినిమాలోని పాత్ర కోసం దిగాడా...? అనే విషయం తెలియాల్సి ఉంది. 
 
ప్రస్తుతం రానా వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాట పర్వం సినిమాలో నటిస్తున్నాడు. రానాకు జోడీగా సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తోంది. 2020 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ప్రముఖ నటి టబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. 1990 సంవత్సరం నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఎల్ వి సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ సోషల్ డ్రామాగా విరాటపర్వం తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్, బాలీవుడ్ నటి జరీనా వాహబ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టబు ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించబోతుందని సమాచారం. పడి పడి లేచే మనసు సినిమా తరువాత సాయి పల్లవి కొంత గ్యాప్ తీసుకొని ఈ సినిమాలో నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: