సంచలన దర్శకుడు రాం గొపాల్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కిన మూవీ కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమా రిలీజ్ పై స్టే కోరుతూ కొందరు తెలంగాణా హైకోర్ట్ లో పిటీషన్ వేయగా సినిమా చూసి వారంలోగా వివరణ ఇవ్వాలని తీర్పు వచ్చింది. ఇక ఏపిలోనూ సినిమాకు క్లియరెన్స్ రాలేదు. అయితే ఈ సినిమా వివాదానికి కారణమైన టైటిల్ ను కూడా మార్చేశాడు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్ కాస్త అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చాడు.

 

ఈ శుక్రవార్మ రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఎలాగోలా అడ్డుకున్నారు. అయితే ఈ సినిమాలో ఏ పార్టీని.. ఏ వ్యక్తిని కించపరచలేదు అంటున్నాడు ఆర్జివి. కడప అంటే తనకేమి ప్రత్యేకమైన అభిమానం లేదని చెప్పిన వర్మ కడపు ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నాడు. కడప నుండే రాజశేఖర్ రెడ్డి, జగన్ వంటి నాయకులు వచ్చారు. మా సినిమా కథ కూడా అదే కాబట్టి కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ పెట్టామని అన్నారు ఆర్జివి.

 

ఇక తను టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకిని అన్న మాట వాస్తవం కాదని అంటున్నాడు ఆర్జివి. రాష్ట్ర విభజన, కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం.. అక్కడకు కడప రెడ్లు రావడం ఇది ప్రపంచమంతా తెలుసని.. ఈ కథనే తాను సినిమాలో డ్రమెటిక్ గా తీశానని అన్నారు. 

 

తను తీసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా కూడా చంద్రబాబుకి వ్యతిరేకంగా తీయలేదని.. ఎన్.టి.ఆర్ జీవితంలో ఏం జరిగిందో తాను చెప్పానని అన్నారు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని కమ్మోళ్ల మీద ఉందని. తనకి కమ్మ సామాజిక వర్గం అంటే ఇష్టమని అన్నారు ఆర్జివి. సినిమాలో వాళ్లకు వ్యతిరేకంగా ఏం చూపించలేదని గట్టిగా చెబుతున్నారు వర్మ. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: