
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సినిమా మేకింగ్, కథా కథనాల్లో వస్తున్న మార్పులు కలెక్షన్ల పరంగా ఎంత క్రేజ్ పెరుగుతుందో, అంతే రీతిలో వివాదాలకు కూడా ముఖ్య కారణం అవుతాయి. ముఖ్యంగా బోల్డ్, వివాదాస్పద కంటెంట్‌తో వస్తున్న సినిమాలు రిలీజ్ చేసే విషయంలో ఇబ్బందులు చాల ఎదురుకుంటున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` సినిమా ఈ విషయంలో సమస్యలు బాగా ఎదురుకోవడం జరిగింది. తాజాగా మరో తెలుగు సినిమా కూడా ఈ లిస్ట్‌లో ఉంది అని సమాచారం.
ఇక తెలుగు ఇండస్ట్రీలో ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో కార్తికేయ. ఈ బోల్డ్ హీరో తాజాగా నటిస్తున్న సినిమా 90 ఎంఎల్. కథా కథనాల పరంగా బోల్డ్ కంటెంట్ కాకపోయినా సినిమా టైటిల్ మాత్రం కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉండేలా ప్లాన్ చేయడం జరిగింది చిత్రయూనిట్. కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కార్తికేయ హోం బ్యానర్లో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వహిస్తున్నారు.
ఇక సినిమాకి సంబందించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని ముందుగానే సిద్ధం చేసుకున్నారు చిత్రయూనిట్. కానీ ఇంత వరకు ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాలేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కొన్ని ఆడియో, వీడియో కట్స్ సూచించడం జరిగింది. అయితే చిత్రయూనిట్ సెన్సార్ టీం చూపించిన అన్ని కట్స్‌కు సుముఖంగా లేదని అందుకే సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో ఆలస్యం అవుతుంది అని సమాచారం. రిలీజ్‌కు మరో 24 గంటలు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ ఈ ఒక్క రోజులో ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
ఇటీవల కాలంలో చాలా సినిమాలకు ఈ సమస్యలను ఎదుర్కోవడం బాగా జరుగుతుంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` సినిమా కూడా సెన్సార్ సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే కదా. గత నెలలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో కమిటీ సభ్యులు నిరాకరించడం జరిగింది. ఇక మరి 90 ఎంఎల్ సినిమా అప్పటికి రిలీజ్ అవుతుందో చూడాలి మరి ఇంకా....