మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ఇద్దరు మెగా డైరెక్టర్స్ టార్గెట్ చేస్తున్నారు. మెగాస్టార్ తో మెగా ప్రాజెక్ట్ చేసిన డైరెక్టర్, స్టైలీష్ స్టార్ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ వరుణ్ తేజ్ తో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త డైరెక్టర్ తో మూవీ చేస్తున్న మెగా ప్రిన్స్ స్టైలీష్ స్టార్ డైరెక్టర్ కు ఒకే చెప్పుతాడా మెగాస్టార్ డైరక్టర్ తో కమిట్ అవుతాడా..!


బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో వరుణ్ తేజ్ మంచి స్వీంగ్ లో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఎఫ్ 2తో సక్సెస్ చదివి చవిచూసిన మెగాప్రిన్స్ ఆ మధ్య గద్దల కొండ గణేశ్ గా బాక్సాఫీసును వణికించాడు. ముఖ్యంగా గద్దలకొండ గణేశ్ గా వరుణ్ తేజ్ పర్పామెన్స్ ఆడియన్స్ తో పాటు డైరెక్టర్స్ ఇంప్రెస్ అయ్యారు. దీంతో వరుణ్ తో వర్క్ చేసేందుకు టాప్ డైరెక్టర్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు మెగా డైరెక్టర్ వరుణ్ తేజ్ పై ఫోకస్ చేస్తుండటం విశేషం. 

 

గద్దల కొండ గణేశ్ సినిమా తర్వాత పలువురు డైరెక్టర్స్ వరుణ్ తేజ్కోసం కథలు తయారు చేస్తున్నారట. అందులో సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ చెప్పిన లైన్స్ కు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినిపిస్తోంది. అంతేకాదు మరో ఇద్దరు కొత్త దర్శకులతో కూడా సినిమాలు చేస్తానంటూ మెగా ప్రిన్స్ హామీ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ మెగా హీరో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. 

 

అన్ని అనుకున్నట్టు జరిగితే వరుణ్ తేజ్, వక్కంతం వంశీ మూవీ వేసవిలో సెట్స్ పైకి వెళుతోందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. వక్కంతం వంశీ, అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంతో దర్శకుడిగా టర్న్ తీసుకున్న విషయం  తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వక్కంతం వంశీకి ఇక ఛాన్స్ లు కష్టమే అనుకున్నారు. కానీ ఈ రైటర్ కమ్ డైరక్టర్ సైలంట్ గా మెగా ప్రిన్స్ తో మూవీకి సన్నాహాలు చేస్తుండటం విశేషం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైతం వరుణ్ తేజ్ మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: