సిని రంగంలో తమిళ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. టాలీవుడ్ ఎక్కువగా అక్కడ నటించే హీరోయిన్ల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. కేరళ నుంచి వచ్చే హీరోయిన్లు కూడా ఎక్కువగా తెలుగులో సినిమాలు చేసే వారు. ఎందరో టాలీవుడ్ హీరోయిన్లు తమిళం నుంచి వచ్చిన వారే... అయితే ఇప్పుడు ఆ హీరోయిన్లు అంటే చాలు తెలుగు సినిమా భయపడిపోతుంది. వాళ్ళ డిమాండ్లకు తెలుగు నిర్మాతలు కంగారు పడుతున్నారు. వాస్తవానికి తమిళంలో తెలుగులో కంటే ఎక్కువ సినిమాలు వస్తాయి.
దానికి తోడు అక్కడ నటనకు కూడా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని కీలక పాత్రలకు అక్కడి హీరోయిన్లు నటించాలి అంటే వాళ్లకు కొన్ని లక్షణాలు ఉండాలి... తెలుగులో లేడీ ఓరియంటెడ్ పాత్రలకు ఇప్పుడు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. అందు కోసం తమిళ హీరోయిన్ల మీద నిర్మాతలు ఆధారపడుతున్నారు. దీనిని ఆధారంగా చేసుకున్న వాళ్ళు... భారీ పారితోషకం డిమాండ్ చేయకుండా... తాము ఎప్పుడు సమయం కేటాయిస్తే అప్పుడే షూటింగ్ అంటూ స్పష్టంగా చెప్తున్నారట.
ఇక హైదరాబాద్ లో షూటింగ్ అయినా, ఆంధ్రాలో ఎక్కడైనా షూటింగ్ అయినా సరే స్టార్ హోటల్స్ కూడా భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మచిలీపట్టణం లో షూటింగ్ అనుకు౦టే విజయవాడలో లగ్జరీ హోటల్ డిమాండ్ చేస్తున్నారట. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ షూటింగ్ జరిగినా సరే హైదరాబాద్ లో లగ్జరీ హోటల్ అడుగుతున్నారట.
ఓ స్టార్ హీరోయిన్ అయి తే సినిమాలు చేసేందుకే నానా కండీషన్లు పెట్టడంతో పాటు అసలు ఆమె ప్రమోషన్లకు కూడా రాదు. ఈ విషయంలో ఆమెకు చాలా తల బిరుసు అనే విమర్శలు ఉన్నాయి. ఇక తమతో పాటు వచ్చే వాళ్లకు కూడా అవే కావాలని లేకపోతే కష్టమని చెప్తున్నారట. ఇదంతా విన్న నిర్మాతలు ఆ సినిమా కాకపోతే ఇంకో సినిమా వాళ్ళ కోసం జేబులు ఎక్కడ ఖాళీ చేసుకోవాలని... రూపాయి వ్యాపారానికి పది రూపాయల పెట్టుబడి అని బెదిరిపోతున్నారట.